Prabhas Fans Worried : ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో?
Shaakuntalam Effect On Adipurush Movie : 'శాకుంతలం' సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ బాలేదని విమర్శలు, సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఆ రివ్యూలు ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
'శాకుంతలం' బాలేదని విమర్శకులు స్పష్టం చేశారు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో ఒక్కటంటే ఒక్క పాజిటివ్ రివ్యూ కూడా రాలేదు. రివ్యూ రైటర్స్ మాత్రమే కాదు... సినిమా చూసిన సగటు ప్రేక్షకులు సైతం బాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆ రివ్యూలు ప్రభాస్ అభిమానులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు అంటే...
ప్రభాస్ అభిమానులను భయపెట్టిన శాకుంతలం!
'శాకుంతలం'పై ప్రధానంగా వచ్చిన విమర్శల్లో వీఎఫ్ఎక్స్ బాలేదనేది ఒకటి. ఆ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ నాశిరకంగా ఉన్నాయని విమర్శకులు, ప్రేక్షకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. త్రీడీ ఎఫెక్ట్స్ కూడా అసలు బాలేదని తేల్చేశారు. ఈ మాటలే ప్రభాస్ అభిమానులను భయపెడుతున్నారు. 'శాకుంతలం' సినిమా చూసి ఆడియన్స్ ఈ విధంగా అంటుంటే... 'ఆదిపురుష్' విడుదలైన తర్వాత ఏం అంటారోనని ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెడుతున్నారు.
''మీరు 'శాకుంతలం' వీఎఫ్ఎక్స్ చూసి బాధ పడుతున్నారు. నేను జూన్ లో వచ్చే ఒక కళాఖండం వీఎఫ్ఎక్స్ గురించి ఆలోచిస్తున్నాను'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హిందీ దర్శకుడు ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న విడుదల కానుంది. దాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని నెటిజనులకు ఈజీగా అర్థమైంది.
రామాయణం ఆధారణంగా 'ఆదిపురుష్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రభాస్ అభిమానులు విశ్వంలో విహరించారని, కాన్సెప్ట్ వాళ్ళను అంత ఎగ్జైట్ చేసిందని, టీజర్ చూశాక అందరూ నీరసించి పోయారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్ (Adipurush Teaser)లో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ వరస్ట్ అంటున్నారు.
Also Read : మీరా జాస్మిన్ రీఎంట్రీ సినిమా రిలీజ్ ఆ రోజే - సముద్రఖని ఫస్ట్ లుక్ వచ్చేసింది
Meeru shaakuntalam VFX chusi badha padthunnaru.. nenu june lo vache oka kalakhandam VFX gurinchi alochisthunna pic.twitter.com/tFxd3cFtsL
— R R (@RacchaRidhvik) April 14, 2023
'ఆదిపురుష్' కూడా దొరికేస్తుందా?
'శాకుంతలం' విడుదల తర్వాత మరో నెటిజన్ చేసిన ట్వీట్ ఇది... ''ఊహించినట్టు ఈ రోజు 'శాకుంతలం' దొరికేసింది. రేపు 'ఆదిపురుష్' కూడా అనిపిస్తుంది. ఇండియాలో వీఎఫ్ఎక్స్ చేయాలంటే ఎస్.ఎస్. రాజమౌళియే. 'ఈగ', 'బాహుబలి'లో విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవల్. కానీ, 'ఆర్ఆర్ఆర్'లో అక్కడక్కడా కొన్ని మిస్టేక్స్ తో తప్పించుకున్నాడు. ఆయన మళ్ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
Also Read : 'విడుదల' రివ్యూ : అంచనాలు పెంచిన విజయ్ సేతుపతి, వెట్రిమారన్ - పార్ట్ 1 ఎలా ఉందంటే?
as expected eeroju #Shaakuntalam దొరికేసింది repu #Adipurush kudaa anipisthundi.
— Gona Buddha Reddy (@GonaBuddhaReddy) April 14, 2023
India lo VFX use చేయాలంటే SSR ye, #ఈగ, బాహుబలి సిరీస్ Thop next level కానీ #RrR lo అక్కడక్కడ కొన్ని mistakes tho తప్పించుకున్నాడు but He will bounce back for sure.
తప్పులు సరిదిద్దే పనిలో 'ఆదిపురుష్' టీమ్!
'ఆదిపురుష్' టీజర్ విడుదల చేసిన తర్వాత వచ్చిన విమర్శలు చిత్ర బృందం దృష్టికి వెళ్లాయి. దాంతో విడుదల వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మళ్ళీ చేయించే పనిలో పడ్డారు.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో 'ఆదిపురుష్'ను తెరకెక్కిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే... ప్రభాస్ అభిమానులు తమ హీరో పోరాటాలు చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. మోషన్ క్యాప్చర్ ప్రభాస్ తమకు వద్దని ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. కొన్ని సెకన్స్ వ్యవధి గల టీజర్ చూసి సినిమా గురించి ఓ నిర్ణయానికి రావద్దని చిత్ర బృందంలోని కీలక సభ్యులు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే... సినిమాకు టీజర్ చాలా డ్యామేజ్ చేసిందనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఆకాశంలో ఉన్న అంచనాలను ఒక్కసారిగా కిందకు పడేసింది.
'ఆదిపురుష్' గురించి కాకుండా 'సలార్' సినిమా అప్డేట్స్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు ముందు ఇంత నెగిటివిటీ రావడంతో ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.