By: ABP Desam | Updated at : 15 Apr 2023 09:51 AM (IST)
'విమానం' సినిమాలో మాస్టర్ ధ్రువన్, సముద్రఖని
నట సింహం నందమూరి బాలకృష్ణ 'మహారథి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గుడుంబా శంకర్', మాస్ మహారాజా రవితేజ 'భద్ర' సినిమాల్లో కథానాయికగా నటించిన మీరా జాస్మిన్ (Meera Jasmine) కొంత విరామం తర్వాత తెలుగు తెరకు వస్తున్న సినిమా 'విమానం' (Vimanam Movie). సముద్రఖని, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
జూన్ 9న 'విమానం' విడుదల
'విమానం'ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు.
సముద్రఖని ఫస్ట్ లుక్, ప్రోమో చూస్తే...
Samuthirakani Role In Vimanam Movie : 'విమానం'లో విలక్షణ నటుడు, దర్శక - రచయిత సముద్రఖని పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని అర్థం అవుతోంది. ఈ శుక్రవారం ఆయన ఫస్ట్ లీక్, ప్రోమో విడుదల చేశారు. అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా కన్న కుమారుడిని జాగ్రత్తగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రలో సముద్రఖని నటించారు. ప్రోమోలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.
వీరయ్య కుమారుడు రాజుకు విమానంలో ప్రయాణించాలని కోరిక. ''విమానం ఎక్కించావా నాన్నా ఒక్కసారి!'' అని కుమారుడు అడుగుతాడు. ''విమానం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం నాన్నా?'' అని తండ్రి ప్రశ్నిస్తాడు. ''మేఘాల్లో నుంచి కిందకు చూస్తే... కొండలు, చెట్లు, ఇల్లు అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయట నాన్నా'' అని కుమారుడు వివరిస్తాడు. ''బాగా చదువుకుని పెద్దోడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు విమానం'' అని తండ్రి చెబుతాడు. వాళ్ళిద్దరి సంభాషణ, నటన హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.
''జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే ఈ 'విమానం'. తండ్రి కుమారుల అనుబంధంతో పాటు ఎన్నో మంచి అంశాలు మా సినిమాలో ఉన్నాయి'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందట. ప్రోమోకు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : 'విడుదల' రివ్యూ : అంచనాలు పెంచిన విజయ్ సేతుపతి, వెట్రిమారన్ - పార్ట్ 1 ఎలా ఉందంటే?
జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ క్రేజీవాల్ మాట్లాడుతూ ''కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. భావోద్వేగాల కలబోతగా బలమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు నచ్చే కథలు, సినిమాలను అందించటమే మా లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, కూర్పు : మార్తాండ్ కె. వెంకటేష్, కళ : జె.జె. మూర్తి, మాటలు : హను రావూరి, సంగీతం : చరణ్ అర్జున్, రచన & దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల.
Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?
Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా
Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?
Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?
‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్