Pawan Kalyan's OG Update : పవర్‌ఫుల్ అప్డేట్ - 'ఓజీ' కోసం ముంబైకు పవన్ కళ్యాణ్, ఎప్పుడంటే?
Pawan's OG Original Gangster Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' (OG Original Gangster Movie). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి చిత్ర సమర్పకురాలు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది.
సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, దాని మీద క్యాప్షన్ గుర్తు ఉందా? 'ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు' (They Call Him #OG) అని పేర్కొన్నారు. ఇప్పుడు దానినే టైటిల్ కింద ఫిక్స్ చేశారని సమాచారం. 'ఓజీ - గ్యాంగ్ స్టర్' టైటిల్ రిజిస్టర్ చేయించింది డీవీవీ సంస్థ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇది పాన్ ఇండియా రిలీజ్ కోసం అన్నమాట. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసేదీ అనౌన్స్ చేసింది.
పవన్ భాయ్... చలో ముంబై!
ముంబైలో ఈ రోజు 'ఓజీ' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు దర్శక - నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఓ వీడియో విడుదల చేశారు. వచ్చే వారం పవన్ షూటింగులో జాయిన్ అవుతారని తెలిపారు. ఈ మధ్య సుజీత్ టెస్ట్ షూట్ చేశారు. అందులో పవన్ లేరు. రెండు రోజులు సన్నివేశాలు ఏ విధంగా తీయాలో చూసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
ముంబైలో చేసే చిత్రీకరణ (ఫస్ట్ షెడ్యూల్)లో పవన్ కళ్యాణ్ సహా హీరోయిన్, ఇతర కీలక తారాగణం పాల్గొంటారట. ఐదు రోజులు పవన్ షూట్ ఉంటుందట. ఆ తర్వాత ఆయన లేకుండా నెలాఖరు తేదీ వరకు కొన్ని సీన్లు తీయాలని ప్లాన్ చేశారట. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. మాఫియా డాన్స్ అందరూ ఆయన అంటే భయపడే సన్నివేశాలు ఉన్నాయట.
Also Read : పవన్ కళ్యాణ్ మాసివ్ యాక్షన్ సీన్ - 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో...
We are beginning the shoot of our film #OG today in Bombay… https://t.co/GHxG8txrsn
— DVV Entertainment (@DVVMovies) April 15, 2023
The #OG @PawanKalyan garu will be joining us next week🔥🔥 @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥
రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, సుజీత్ కలిసి ముంబై వెళ్లి వచ్చారు. కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. ఈ సినిమా రీమేక్ కాదని తెలిసింది. పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సుజీత్ స్టయిలిష్ యాక్షన్ స్క్రిప్ట్ డిజైన్ చేశారట. ఈ కథ కంటే ముందు అతడి చేతిలో వేరే స్క్రిప్ట్ పెట్టారని, ఆ రీమేక్ చేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో స్ట్రెయిట్ సినిమా చేయడానికి పవన్ మొగ్గు చూపారు.
పవన్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్ (Pawan DVV Movies)తో సినిమా చేస్తుండటం విశేషం.
'ఓజీ' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు పవన్.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో?