Pawan Kalyan's Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ మాసివ్ యాక్షన్ సీన్ - 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో...
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) కథానాయకుడిగా ఆయనతో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన యువ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మధ్య హైదరాబాదులో ఎనిమిది రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ చేశారు. అందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు చిత్ర బృందం తెలిపింది.
వెయ్యి మంది జూనియర్ ఆరిస్టులు...
'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీల (Sreeleela) కథానాయికగా చేస్తున్నారు. ఆమె కూడా ఫస్ట్ షెడ్యూల్ షూటింగులో పాల్గొన్నారు. హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు.
స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ (Ram Laxman Masters) నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసినట్లు 'ఉస్తాద్ భగత్ సింగ్' యూనిట్ తెలియజేసింది. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీన్లు తీశారు. అవి సినిమాలో హైలైట్ అవుతాయట!
పవన్ కళ్యాణ్... శ్రీలీల... రొమాంటిక్ సీన్లు!
'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. అందులో కొన్ని సీన్లు తీశారు. కొంత మంది చిన్నారులతో వినోదభరిత సన్నివేశాలు సైతం తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు తీసినట్లు చిత్ర బృందం పేర్కొంది. నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.
పవన్... స్పెల్ బైండింగ్ మ్యానరిజమ్!
పవన్ కళ్యాణ్ అంటే ఆయన మేనరిజమ్స్ కూడా అభిమానులకు గుర్తుకు వస్తాయి. హరీష్ శంకర్ సైతం పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో స్పెషల్ మేనరిజమ్స్ క్రియేట్ చేశారట. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్ల్ బైండింగ్ మ్యానరిజంలతో పవన్ కళ్యాణ్ ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో?
అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఎర్రమంజిల్ ఏరియాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ లుంగీ (Pawan Kalyan Lungi Look)తో కనిపిస్తారు. ఈ సినిమాలో పవన్ పోలీసుగా కనిపించనున్నారు. ఇంతకు ముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్'లో సైతం పోలీస్ రోల్ చేశారు. అలాగే, 'భీమ్లా నాయక్' సినిమాలోనూ పోలీస్ రోల్ చేశారు. ఆ రెండు సినిమాల్లో కూడా లుంగీ లుక్ ఉంటుంది. మరోసారి లుంగీ వేయడంతో ఫ్యాన్స్ సూపర్ హిట్ పక్కా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Also Read : మీరా జాస్మిన్ రీఎంట్రీ సినిమా రిలీజ్ ఆ రోజే - సముద్రఖని ఫస్ట్ లుక్ వచ్చేసింది