అన్వేషించండి

Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర'లో ఛోటా హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?

Vishwambhara movie actress: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్. ఆ విషయం అందరికీ తెలుసు. ఆమెతో పాటు మరొక భామను ఎంపిక చేశారని టాక్. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'. ఇందులో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్. అయితే... ఆమెతో పాటు మరో ఇద్దరు అందాల భామలకు కథలో చోటు ఉందట. త్రిషతో పాటు మరొక కథానాయికను కూడా సెలెక్ట్ చేశారట. ఐదేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న ఆ ఛోటా హీరోయిన్ ఎవరంటే?

'విశ్వంభర' సినిమాలో సురభికి ఛాన్స్!?
శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలో హీరోయిన్ గుర్తు ఉందా? సురభి! అంతకు ముందు ధనుష్ 'రఘువరన్ బీటెక్'లో చేసిన పాత్రతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాని 'జెంటిల్ మన్', సందీప్ కిషన్ 'బీరువా', విష్ణు మంచు 'ఎటాక్', 'ఓటర్' సినిమాల్లో నటించారు.

'విశ్వంభర' సినిమాలో ఓ పాత్రకు సురభిని ఎంపిక చేసినట్టు తెలిసింది. 'ఓటర్' తర్వాత తెలుగు ఆమె నటిస్తున్న చిత్రమిది. సురభిని ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!

Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర'లో ఛోటా హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?

'విశ్వంభర' చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార' తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే 2025 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

హైదరాబాద్ సిటీలో 13 సెట్స్!
'విశ్వంభర' కోసం హైదరాబాద్ సిటీలో 13 సెట్స్ వేశారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు త్రిష మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మెగాస్టార్ 156వ చిత్రమిది. సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమైన 'బింబిసార' కూడా ఆ తరహా చిత్రమే. అందుకని మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఓవర్సీస్ రైట్స్ కోసం సుమారు 18 కోట్లకు పైగా కోట్ చేసినట్లు టాక్. ఇందులో విలన్ రోల్ రానా దగ్గుబాటి చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, చిత్ర బృందం ఏమీ చెప్పలేదు. విలన్, మరొక హీరోయిన్ వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

'విశ్వంభర' తర్వాత చిరంజీవి నటించే సినిమా ఇంకా ఖరారు కాలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కథ విని చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Also Readబ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి - ఆయనకు నవ్వించడమే కాదు... కంటతడి పెట్టించడమూ వచ్చు!

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget