Vishwambhara Release Date : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ ఎప్పుడంటే?
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై క్రేజీ బజ్ నెలకొంది.

Chiranjeevi Vishwambhara Release Date : మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి అవెయిటెడ్ సోషల్ ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' రిలీజ్‌పై క్రేజీ అప్డేట్ వచ్చింది. 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సమ్మర్ తర్వాత రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్, సరైన అవుట్ పుట్ కోసమే వాయిదా వేసినట్లు తెలుస్తుండగా... టీజర్‌లో వీఎఫ్ఎక్స్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై టీం దృష్టి సారించగా 2026 జూన్‌లో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయితే, ఫైనల్ అవుట్ పుట్ మెగాస్టార్ చూసిన తర్వాత అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - 'వేర్ ఈజ్ చంద్రిక?'... సస్పెన్స్ వీడనుందా!
ప్రస్తుతం చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడికి 4 నెలల తర్వాత 'విశ్వంభర' రిలీజ్ చేస్తే రెండింటి మధ్య అంత ఇంపాక్ట్ ఉండదని టీం భావిస్తోందట. ఆడియన్స్‌కు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ మూవీ కోసం పనిచేస్తున్నాయట. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, లుక్స్ అదిరిపోయాయి. 'రామ రామ' సాంగ్ ట్రెండ్ అవుతోంది.
మూవీలో చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే 'నా సామిరంగ' ఫేం ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తుండగా... ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వరుస సినిమాలు వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.





















