అన్వేషించండి

Chiranjeevi: యాక్షన్ మోడ్‌లో మెగాస్టార్... డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్... చిరు158 లేటెస్ట్ అప్డేట్

Chiru Bobby 2: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన 'వాల్తేరు వీరయ్య' ఘనవిజయం సాధించింది, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మరో మూవీ చేస్తున్నారు. ఆ సినిమా అప్డేట్ ఏమిటంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెగాస్టార్ చిరంజీవి డూప్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు.
  • KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది, టైటిల్ టీజర్ త్వరలో.
  • బాబీ దర్శకత్వంలో చిరు158 చిత్రానికి అనశ్వర రాజన్, థమన్ పనిచేస్తున్నారు.

Chiru 158 Movie Update: మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించింది. స్వతహాగా చిరు అభిమాని అయిన బాబీ... తన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ష్యూర్ షాట్ హిట్ తీశారు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. చిరు, బాబీ కలయికలోని ఆ సినిమా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి. 

డూప్ లేకుండా మెగాస్టార్ రిస్కీ స్టంట్స్!
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రెండో సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల 'బాలన్: ది బాయ్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. దళపతి విజయ్ హీరోగా 'జన నాయగన్'ను ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఖర్చుకు వెనుకాకుండా భారీ ఎత్తున తెలుగులో తమ డెబ్యూ సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యారు.

Also Read: Sobhita Dhulipala Latest Photos - చేనేత చీరలో శోభిత... సంప్రదాయానికి అక్కినేని పెద్ద కోడలి ఓటు

ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిరు - బాబీ 2 షూటింగ్ జరుగుతోంది. ఇందులో చిరు మీద భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు. రామ్ - లక్ష్మణ మాస్టర్స్ నేతృత్వంలో కథకు కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇందులో చిరును పవర్ ఫుల్ అండ్ డైనమిక్ అవతార్‌లో చూస్తారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ అన్నిటినీ మెగాస్టార్ స్వయంగా చేస్తున్నారని తెలిపారు.

Also Read: Super Girl OTT Release Streaming Date - భారీ బడ్జెట్... బాక్సాఫీస్ డిజాస్టర్ - రెండు ఓటీటీల్లో హాలీవుడ్ సూపర్ గర్ల్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KVN Productions (@kvn.productions)

త్వరలో టైటిల్ టీజర్ విడుదల!?
Chiru Bobby 2 Title Teaser: చిరంజీవి హీరోగా రూపొందుతున్న 158వ చిత్రమిది. అందుకని, చిరు158ని వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న 'ఛాంపియన్' ఫేమ్ అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కోన వెంకట్ - చక్రవర్తి రెడ్డి, అడిషనల్ స్క్రీన్ ప్లే: హరి మోహనకృష్ణ - వినీత్ పొట్లూరి, మాటలు: భాను - నందు, రచన - దర్శకత్వం: బాబీ కొల్లి. 

Also Read: Express Hari - మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

Frequently Asked Questions

చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎన్నవది?

ఇది మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం. 'వాల్తేరు వీరయ్య' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది.

ప్రస్తుతం చిరు - బాబీ 2 సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. డూప్ లేకుండా ఆయన రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?

చిరంజీవి 158వ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చిరు 158 సినిమా టైటిల్ టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు?

త్వరలో సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 'చిరు158' అనేది వర్కింగ్ టైటిల్.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget