Super Girl OTT : భారీ బడ్జెట్... బాక్సాఫీస్ డిజాస్టర్ - రెండు ఓటీటీల్లో హాలీవుడ్ సూపర్ గర్ల్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Super Girl OTT Platform : హాలీవుడ్ రీసెంట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ 'సూపర్ గర్ల్'. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Milly Alcock's Super Girls OTT Release Date Locked : సూపర్ హీరో కాన్సెప్ట్ అనగానే మనకు భారీ యాక్షన్ అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి. అలాంటి జానర్‌లోనే రీసెంట్‌గా వచ్చిన మూవీ సూపర్ గర్ల్ (Super Girl). ఎన్నో అంచనాల మధ్య గత నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మిల్లీ అల్కాక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్‌ల్లో ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి రానుంది.
దాదాపు $170 మిలియన్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. దాదాపు $100 మిలియన్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD)గా డిజిటల్ రిలీజ్ అనౌన్స్ చేశారు. క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాసన్ మోమోవా, మాథియాస్ షోనార్ట్స్, ఈవ్ రిడ్లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జేమ్స్ గన్, పీటర్ సాఫ్రాన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read : Con City OTT : ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ - IMDbలో 9.1 రేటింగ్... తెలుగులోనూ స్ట్రీమింగ్
స్టోరీ ఏంటంటే?
క్రిప్టన్ గ్రహం నాశనమైన తర్వాత భూమికి చేరిన కరా జోర్ ఎల్ (సూపర్ గర్ల్)కి చెందిన స్పేస్ డాగ్ క్రిప్టో... శత్రువుల చేతిలో విష ప్రయోగానికి గురవుతుంది. తన కళ్ల ముందే కుటుంబం, స్నేహితులను కోల్పోయిన కరా జోర్ ఎల్‌ను ఇది మరింత బాధిస్తుంది. దీంతో అతన్ని కాపాడుకోవడంతో పాటు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు అంతరిక్ష ప్రయాణం చేస్తూ గెలాక్సీ అంతటా సాహసాలు చేస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ఓ ఊహించని తోడు దొరుకుతుంది. మరి క్రిప్టోను సూపర్ గర్ల్ ఎలా కాపాడింది. ఈ జర్నీలో ఆమెకు ఎదురైన అనుభవాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : Romanchakam Glimpse : రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















