By: ABP Desam | Updated at : 22 Aug 2021 01:19 PM (IST)
చిరంజీవితో పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిరంజీవి ఎందరికో మార్గదర్శి అని, మరెందరికో స్ఫూర్తి అని, ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం అని గుర్తు చేసుకున్నారు.
‘‘అన్నయ్యను అభిమానించే, ఆరాధించే లక్షలాది మందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ, ఆయన సినిమాలను చూస్తూ.. ఆయన ఉన్నతిని కనులారా చూశాను. ఒక అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలన చిత్ర రంగంలో అగ్ర పథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా.. నందులు తరలి వచ్చినా.. పద్మ భూషణ్‌గా కీర్తి గడించినా.. చట్ట సభ సభ్యుడిగా.. కేంద్ర మంత్రిగా పదవులను అలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత, చిరంజీవి గారి సొంతం.
Also Read: Chiranjeevi Birthday Special: చిరు ‘లూసిఫర్’ రీమేక్ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదుర్స్
అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి గారు నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి.. కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవా గుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా ఉన్నారంటే ఆదుకోవడంలోనూ ముందుంటారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు.. చేస్తూనే ఉన్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపన పడ్డారు. అందువల్లే సినీ కార్మికులు అందరూ చిరంజీవి గారిని తమ నాయకుడిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు.
చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమ మూర్తి పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తు్న్నాను.’’ అని పవన్ కల్యాణ్ తన అన్నయ్యపై ప్రేమను చాటుతూ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు మహేష్ బాబు సర్‌ప్రైజ్.. 154వ సినిమా టైటిల్ వచ్చేసింది..
.@kchirutweets అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #HBDMegastarChiranjeevi pic.twitter.com/Fn6RNaxzhq
— JanaSena Party (@JanaSenaParty) August 22, 2021
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?