By: ABP Desam | Updated at : 22 Aug 2021 10:22 AM (IST)
మెహర్ రమేష్, చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు చిరంజీవి బర్త్ డే ను మెగా రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిరు పుట్టినరోజుకు మహేష్ సర్‌ప్రైజ్ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు మీకోసం..
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా అప్‌డేట్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు వచ్చింది. నేడు చిరు బర్త్ డే సందర్భంగా 154వ సినిమాకు సంబంధించిన మెగా అప్ డేట్ వచ్చేసింది. అది కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. వేదాళం మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా టైటిల్‌ను నేడు మహేష్ బాబు ఆవిష్కరించారు. ఈ మూవీకి భోళా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
Also Read: చెన్నైలో ఎన్టీఆర్ రూమ్‌లోనే చిరంజీవి బస.. సుధాకర్ నిర్ణయం చిరు జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది?
Happy birthday @KChiruTweets garu🤗 Honoured to be unveiling the title of your film! #BholaaShankar, under the directorial skills of my good friend @MeherRamesh and my favourite producer @AnilSunkara1 garu
May the year ahead bring you great health and success. All the best sir! pic.twitter.com/U9czmnIK5I— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2021
ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మహేష్ బాబు రిలీజ్ చేశారు. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన వేదాళం తెలుగు రీమేక్ భోళా శంకర్‌గా తెరకెక్కనుంది. మెగా యాక్షన్‌తో సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ జరుగుతుండగా మెగాస్టార్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఆచార్య ముగిసేలోపే ‘లుసిఫర్’ సినిమా రీమేక్‌కు సిద్ధమయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్ పతాకంపై చిరు 153వ సినిమా ప్రీలుక్‌ను నిర్మాతలు నిన్న విడుదల చేశారు. ఈ మూవీకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. నేడు చిరు పుట్టినరోజు సందర్భంగా 154వ సినిమా అప్‌డేట్ వచ్చింది.
Also Read: Chiranjeevi Rare Photos: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే