IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Chiranjeevi Birthday: చెన్నైలో ఎన్టీఆర్ రూమ్‌లోనే చిరంజీవి బస.. సుధాకర్ నిర్ణయం చిరు జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది?

అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు.. వాటిని నిలబెట్టుకుని విజయంగా మార్చుకోవడం కూడా ముఖ్యం. ఇందుకు చిరంజీవి జీవితమే నిదర్శనం.

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కర్లేదు. అయితే, ఆయన జీవితం గురించి మాత్రం నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే.. అవకాశాలనేవీ ఎప్పుడూ అంత సులభంగా దొరకవు. ఒక వేళ దొరికితే వాటిని అందిపుచ్చుకుని ఎదగడం కూడా అంత ఈజీ కాదు. అందుకు ఎంతో కష్టపడాలి. అయితే, కష్టం ఒక్కటే జీవితాన్ని ముందుకు నడిపించదు. వ్యక్తిత్వం కూడా దానికి తోడు కావాలి. అప్పుడే.. సాధారణ స్టార్ నుంచి మెగాస్టార్ స్థాయికి చేరుతారు. తరాలు మారిన చిరంజీవికి ఇంతమంది అభిమానులు ఉన్నారంటే కారణం.. కేవలం ఆయన హీరోయిజమే కాదు వ్యక్తిత్వం కూడా కారణమే. అభిమానులంటే హీరోలకు ఫ్లెక్సీలు.. దండలు వేసి హంగామా చేసేవారు కాదని, తన హీరో కోసం మంచి కార్యక్రమాలు కూడా చేయగలవారని నిరూపించిన ఏకైక స్టార్.. మన మెగాస్టార్. ఆయన కుటుంబం నుంచి ఎవరు సినీ రంగంలోకి ప్రవేశించినా ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారంటే కారణం.. చిరంజీవే. అయితే, చిరంజీవి సినీ రంగ ప్రవేశం మాత్రం అంత సులభంగా జరగలేదు. ఇందుకు ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, ఆయన లక్ష్యం ముందు ఆ కష్టాలు కనుమరగయ్యాయే గానీ.. ఆయన్ని ఏ మాత్రం వెనక్కి లాగలేదు. ‘ఒక్క అవకాశం’ దొరికేతే చాలు.. తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆ అవకాశాన్ని విజయంగా మలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘విజేత’గా నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో గడిపిన ఆ రోజులు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిందే.

అది 1976వ సంవత్సరం. చిరంజీవికి సినిమాలంటే చాలా ఇష్టం. అప్పట్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరు తండ్రి కొణిదెల వెంకట్రావుకు కూడా సినిమాలంటే ఇష్టమే. ఆయన కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి రాణించలేకపోయారు. అందుకే చిరంజీవి చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరడానికి బదులు సినీ రంగంలోకి ప్రవేశిస్తానంటే ఆయన కాదనలేకపోయారు. ఎందుకంటే.. చిరు ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే తప్పకుండా అందులో విజయం సాధిస్తాడనేది ఆయన నమ్మకం. అందుకే చిరు ధైర్యంగా చెన్నై వెళ్లి.. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 

సీనియర్ ఎన్టీఆర్ రూమ్‌లో.. సుధాకర్, హరిప్రసాద్‌తో కలిసి..: చెన్నైలోని విజయరాఘవ రోడ్‌లో.. 11వ నెంబర్ ఇంట్లో చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్‌లు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు మిత్రులు ఆ నిర్ణయం తీసుకోడానికి గల కారణం.. ఆ ఇంటికి ఉన్న నేపథ్యమే. తెలుగు సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవారు. ఆ ఇంట్లో మేడ మీద ఉన్న గదిలోనే ఎన్టీఆర్ బస చేసేవారు. ఆ తర్వాత ఎస్వీ రంగారావు కూడా ఆ గదిలోనే ఉండేవారు. ఈ నేపథ్యంలో సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఆ గదిలోనే ఉండాలని ఆ ముగ్గురు మిత్రులు నిర్ణయించుకున్నారు. ఆ గది అద్దె ఖరీదైనదని తెలిసినా చిరంజీవి అందులో ఉండేందుకే ఇష్టపడ్డారు. చిరంజీవి ఖర్చుల కోసం ఆయన తండ్రి నెలకు రూ.100 పంపేవారు. చిరంజీవి ఆ డబ్బునే సరిపెట్టుకునేవారు. ఆ బడ్జెట్‌తోనే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందేవారు. తండ్రి సూచనల మేరకు కాస్ట్ అకౌంటెన్సీ‌లో కూడా శిక్షణ పొందేవారు. ఒక వేళ సినిమాల్లో అవకాశాలు దొరక్కపోతే.. ఉద్యోగం చేసేందుకు ఆ శిక్షణ పని చేస్తుందని ఆయన తండ్రి ఆలోచన. 

ముగ్గురికీ ఒకే షర్ట్: సుధాకర్, హరి ప్రసాద్‌తో కలిసి చిరంజీవి నిత్యం సినిమా అవకాశాల కోసం తిరిగేవారు. ఈ ముగ్గురికి ఒకే ఖరీదైన షర్ట్ ఉండేది. వారిలో ఏ ఒక్కరి ఆడిషన్ జరిగినా ఆ షర్టును మార్చి మార్చి వేసుకొనేవారు. ఆ షర్టులో వెళ్తే కాస్తే అందంగా కనిపిస్తామని, అవకాశాలు దొరుకుతాయని ఆశపడేవారు. హోటల్‌కు వెళ్తే డబ్బులు ఖర్చవుతాయని భావించి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ను ఆ గదిలోనే తయారు చేసుకొనేవారు. ఈ సందర్భంగా వారు పనులు పంచుకున్నారు. చిరంజీవి, సుధాకర్ ఇంట్లో వంట చేస్తే.. హరిప్రసాద్ బయటకు వెళ్లి కూరగాయలు తేవాలి. 

హరిప్రసాద్ మోసం.. చిరు, సుధాకర్ క్లాస్: హరిప్రసాద్ ఎప్పుడు కూరగాయలకు వెళ్లినా డబ్బులు పోయాయి. ఈ కూరగాయలే దొరికాయి సరిపెట్టుకోండని చెప్పేవాడు. దీంతో ఇద్దరికి అనుమానం వచ్చి ఓ రోజు అతడిని అనుసరించారు. హరిప్రసాద్ ఓ హోటల్‌కు వెళ్లి.. గీతా కేఫ్‌లో కడుపు నిండా తినడం చూశారు. ఎప్పటిలాగానే హరి.. డబ్బులు పోయాయని చెప్పడంతో చిరు, సుధాకర్‌కు చిర్రెత్తుకొచ్చి పెద్ద క్లాసే పీకారట. అప్పటి కష్టాలను బట్టి అది వారికి సీరియస్ విషయమే. కానీ, ఆ సంఘటనను ఇప్పుడు వారు సరదాగా చెప్పుకుంటారు. 

మొదటి అవకాశం సుధాకర్‌కే: ఈ ముగ్గురిలో సినిమా అవకాశం ముందుగా సుధాకర్‌కే వచ్చింది. ‘పునాది రాళ్లు’ సినిమా ఆడిషన్స్‌లో సుధాకర్‌ను నలుగురు హీరోల్లో ఒకరిగా ఎంపిక చేశారు. దీంతో చిరంజీవి, హరిప్రసాద్ సంతోషించారు. మనలో ఎవరికి అవకాశం వచ్చినా మనకు వచ్చినట్లేనని ఆనందపడ్డారు. అయితే, సుధాకర్‌ తొలి అవకాశాన్ని అనుకోకుండా వదిలేయాల్సి వచ్చింది. ఓ రోజు సుధాకర్ గీతా కేఫ్ వద్ద స్నేహితుడితో మాట్లాడుతుంటే.. అటుగా కారులో వెళ్తున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా సుధాకర్‌ను చూశారు. ఆ సమయంలో ఆయన ‘కిజక్కే పోగుమ్ రైల్’ అనే సినిమా కోసం హీరోను వెతుకుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అసిస్టెంట్‌ను పంపించి ఆఫీసులో కలవమని సుధాకర్‌కు చెప్పారు. ఎట్టకేలకు సుధాకర్‌ ఆ సినిమాకు హీరోగా ఎంపికయ్యారు. ఆయన పెద్ద దర్శకుడు కావడంతో సుధాకర్ ఆ అవకాశాన్ని కాదనలేకపోయారు. దీంతో ‘పునాది రాళ్లు’ సినిమాను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.

చిరును తొలి అవకాశం అలా వరించింది: తనకు వచ్చిన తమిళ సినిమా అవకాశం గురించి చెప్పేందుకు సుధాకర్.. చిరంజీవితో కలిసి ‘పునాది రాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ను కలిశారు. సుధాకర్ చెప్పింది విని రాజ్‌కుమార్ నిరుత్సాహానికి గురయ్యారు. పక్కనే ఉన్న చిరంజీవిని చూసి మీరు కూడా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థే కదా అని అడిగారు. ఆ పాత్రలో మీరు చేస్తారా? అని అడిగారు. దీంతో చిరంజీవి.. సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. సుధాకర్ ఒప్పుకోమని సైగ చేయడంతో చిరంజీ అంగీకరించారు. అలా చిరంజీవికి తొలి సినిమా అవకాశం దక్కింది. అయితే, ‘పునాది రాళ్లు’ కంటే ముందే ఆయన నటించిన రెండో చిత్రం ‘ప్రాణం ఖరీదు’ ముందుగా రిలీజ్ అయ్యింది. ఈ విషయాలను చెన్నైలోని ‘విజయచిత్ర’ సినిమా పత్రికలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Also Read: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక

చిరు వ్యక్తిత్వమే ఆయన్ని ఆ స్థాయికి చేర్చింది: బీకే ఈశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘చిరు వ్యక్తిత్వమే ఆ స్థాయికి ఎదిగేలా చేసింది. ఆయన చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఆయన నటిస్తుంటే చాలామంది పొగుడుతారు. కానీ, చిరంజీవి తన నటనలో లోపాలు ఉంటే చెప్పండి సరిచేసుకుంటానని అడిగేవారు. ఆయన స్టార్ అయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని అడిగేవారు. మీరు ఇప్పటికే స్టార్ అయిపోయారు కదా.. ఎందుకులెండి అంటే ఒప్పుకొనేవారు కాదు. లోపాలను సరిదిద్దుకు మరింత బాగా చేయొచ్చు కదా అనేవారు. మీరు ఏమీ అనుకోను అంటే.. ఆవేశంలో స్పీడుగా డైలాగులు చెబుతున్నారు. అదొక్కటి సరిచేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను. అది గమనించి ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదంటూ సంతోషంగా ఫీలయ్యారు. ఇలా ఏ హీరో ఉండరు. స్టార్ అయిన తర్వాత అవేవీ పట్టించుకోరు. ఎదిగేందుకు ఏం చేయాలి? మనలో లోపాలను ఎలా సరిచేసుకోవాలి? అనే తపన ఉంటేనే ఎదగలం అని చెప్పేందుకు చిరంజీవే నిదర్శనం. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. 40 ఏళ్లుగా సినీరంగంలో నిలిచిపోయారు’’ అని తెలిపారు. 

Published at : 21 Aug 2021 05:16 PM (IST) Tags: chiranjeevi Chiranjeevi Birthday Chiranjeevi First Movie Chiranjeevi History Punadhirallu చిరంజీవి పుట్టిన రోజు

సంబంధిత కథనాలు

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Allegations On Jeevita 	:  జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం