Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు - తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహిళ ఫిర్యాదు
Criminal Case on Bandla Ganesh:నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై పోలీసుల కేసు నమోదైంది. ఆయనపై ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది.
Case Filed on Bandla Ganesh: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌లో చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంట్లో బండ్ల గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ బండ్ల గణేష్‌పై ఫిలింనగర్ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాలు.. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ తన ఇంటిని బండ్ల గణేష్‌కు రెంట్‌కు ఇచ్చారు. నెలకు రూ. లక్ష అద్దె. అయితే కొంతకాలం బండ్ల గణేష్ ఇంటి రెంట్ చెల్లించడం లేదట. ఈ విషయమై ఆయనను నౌహిరా షేక్ నిలదీయగా బండ్ల గణేష్ రౌడీలతో తనను బెదించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాదు ఇంట్లోకి కూడా రాబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. తన ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని పేర్కొనారు. అంతేకాదు రాజకీయనాయకుల, గుండాల సహాయంతో తన ఇంటిని బండ్ల గణేస్ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ ఇంటిలో బండ్ల గణేస్ అసాంఘిక కార్యక్రపాలకు పాల్పడుతున్నారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పింది. ఈ వ్యవహారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేశ్‌పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: వరంగల్ గుడిలోనే ఎందుకు నిశ్చితార్థం? - అసలు విషయం చెప్పిన అదితి