Brahmanandam: బ్రహ్మానందం మనవడికి తాత పోలికలే - బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి
Brahmanandam Grandson: ఇంట్లో పెద్దల పోలికలు, అలవాట్లు పిల్లలకు వస్తాయని అంటుంటారు. బ్రహ్మానందం మనవడికి తాత పోలికలు వచ్చినట్టు ఉన్నారు. ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తున్నాడో చూశారా?
![Brahmanandam: బ్రహ్మానందం మనవడికి తాత పోలికలే - బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి Bramhanandam Grandson drew Painting Just like his Grandfather Check Details Brahmanandam: బ్రహ్మానందం మనవడికి తాత పోలికలే - బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/46316e99b1ea9e2f6c43dcc39f8476781716119752597313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmanandam and Partha... Like grandfather, Like grandson: పిల్లలకు పెద్దల అలవాట్లు, పోలికలు వస్తాయని మన పూర్వీకుల నుంచి వింటూ వస్తున్నాం. అది నిజమే కాబోలు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మనవడు చేస్తున్న పని చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఇంతకీ, ఆ చిన్నారి ఏం చేశాడో మీరే చూడండి.
చిత్రకారుడిగా మారిన బ్రహ్మీ మనవడు
తెలుగు ప్రేక్షకులను బ్రహ్మానందం నవ్వించినంతగా మరొక నటుడు నవ్వించిన రికార్డు లేదని చెబితే తప్పు కాదేమో! బ్రహ్మీ పేరు చెప్పినా, ఆయన రూపురేఖలు గుర్తుకు వచ్చినా కొందరి ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. ఆయన చేసిన కామెడీ క్యారెక్టర్స్ ప్రభావం అటువంటిది. బ్రహ్మానందంలో అద్భుతమైన హాస్య నటుడు మాత్రమే కాదు... కంటతడి పెట్టించే ప్రతిభావంతుడైన నటుడు కూడా ఉన్నారని రీసెంట్ కృష్ణవంశీ సినిమా 'రంగమార్తాండ'తో పాటు అంతకు ముందు కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే, ఆయనలో మంచి చిత్రకారుడు కూడా ఉన్నారు.
View this post on Instagram
బ్రహ్మానందం అద్భుతంగా పెయింటింగ్ వేస్తారు. ఆయన పెయింటింగ్ వేస్తున్న ఫోటోలను పెద్ద కుమారుడు రాజా గౌతమ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు రాజా గౌతమ్ కుమారుడు, బ్రహ్మీ మనవడు పార్థ కూడా తాతయ్యలా కుంచె పట్టాడు. పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఫోటోను బ్రహ్మీ చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదీ సంగతి! మరి, పెద్దయిన తర్వాత తాతయ్యలా పార్థ కూడా నటుడు అవుతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. అన్నట్టు... పార్థ తర్వాత రాజా గౌతమ్, జోత్స్నా రెడ్డి దంపతులకు ఓ అమ్మాయి జన్మించింది. చిన్న కుమారుడు సిద్ధార్థకు గతేడాది పెళ్లి చేశారు.
Also Read: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన త్రినయని సీరియల్ ఆర్టిస్ట్ చందు
కొంత గ్యాప్ తర్వాత హీరోగా వస్తున్న రాజా గౌతమ్!
Brahmanandam: బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తండ్రి బాటలో నడుస్తూ సినిమాల్లోకి వచ్చారు. 'పల్లకిలో పెళ్లి కూతురు'తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. దాంతో ఆయనకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్లీ సినిమా స్టార్ట్ చేశారు.
రాజా గౌతమ్ హీరోగా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద' వంటి హిట్ ఫిల్మ్స్ తీసిన ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా ఓ సినిమా ప్రారంభించారు. అందులో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఆ సినిమా పేరు 'బ్రహ్మ ఆనందం'. విశేషం ఏమిటంటే... అందులో కొడుకు రాజా గౌతమ్ పాత్రకు తాతయ్య పాత్రలో బ్రహ్మానందం నటిస్తుండటం! ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. రాజా గౌతమ్ రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆశిద్దాం.
Also Read: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)