అన్వేషించండి

Nandamuri Mokshagna : మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగిన మాస్ డైరెక్టర్ - బాలయ్య వారసుడి ఎంట్రీ ఆ సీక్వెల్‌తోనే?

Mokshagna : బాలయ్య నటించిన ఓ బ్లాక్‌బస్టర్ మూవీతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతోందట. బోయపాటి మోక్షజ్ఞ కోసం ఇంట్రెస్టింగ్ రోల్ ని డిజైన్ చేసినట్లు సమాచారం.

Nandamuri Mokshagnya Tollywood Entry : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. మొన్నా మధ్య బాలయ్య కూడా ఈ ఏడాది కచ్చితంగా తన కొడుకు ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. ఇక తాజా సమాచారం అతి త్వరలోనే మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ పవర్ ఫుల్ డైరెక్టర్ మోక్షజ్ఞను పక్క ప్లాన్ తో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? వివరాల్లోకి వెళ్తే..

బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా 'భగవంత్ కేసరి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం NBK109 సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటికే ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ వాటిల్లో ఏదీ కార్యరూపం దాల్చలేదు.

తాజా సమాచారం ప్రకారం త్వరలోనే మోక్షజ్ఞ వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అది కూడా బాలయ్య నటిస్తున్న అఖండ సీక్వెల్‌తో ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో ఉండే క్రేజే వేరు.

ఇప్పటికే వీరీ కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. హ్యాట్రిక్ హిట్స్ అందుకోగా త్వరలోనే 'ఆఖండ 2' రాబోతోంది. ఈ ప్రాజెక్టుతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం బోయపాటి 'అఖండ 2' లో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ ని డిజైన్ చేశారట. సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ చాలా సర్ప్రైజింగ్ గా బోయపాటి ప్లాన్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న బోయపాటి ఈ ఏడాది చివర్లో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ అంతటా వైరల్ గా మారింది. ఇదే కనుక నిజమైతే 'అఖండ 2' మోక్షజ్ఞకి ది బెస్ట్ డెబ్యూ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

నిజానికి 2017 లోనే మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ ఇవ్వాల్సింది. 'ఆదిత్య 369' సిక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలో చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ మోక్షుని పరిచయం చేస్తున్నట్లు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు తన వారసుడు ఎంట్రీ బాధ్యతల్ని బోయపాటికి అప్పజెప్పారట బాలయ్య. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్  వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య NBK109 ప్రాజెక్టు విషయానికి వస్తే.. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : గుంటూరు కారం బెనిఫిట్ షోస్ థియేటర్స్ లిస్ట్ - 1AM నుంచి షురూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget