అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hansal Mehta: కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరు? - బాల‌కృష్ణ, అంజలి వీడియోపై స్టార్‌ డైరెక్టర్‌ ఘాటు వ్యాఖ్యలు

Director Slams Balakrishna: స్టార్‌ హీరో నందమూరి బాల‌కృష్ణపై ప్రముఖ డైరెక్టర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. నటి అంజలిని ఆయన స్టేజ్‌పై తొసిన వీడియోను షేర్‌ చేస్తూ బాలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Director Hansal Mehta Slams Nandamuri Balakrishna: టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాల‌కృష్ణ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విశ్వక్‌ సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ ఈవెంట్‌లో హీరోయిన్‌ అంజలి పట్ల ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అంజలిని స్టేజ్‌పైన ఆయన తోసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ వీడియో చూసిన ఆయన ఆయన విచిత్ర ప్రవర్తనకు షాకై ఆయనపై సంచలన కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్‌ హన్సల్ మెహతా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'స్కామ్1992' (Scam 1992), 'సిటీలైట్స్', అలీఘర్ వంటి సినిమాలతో ఆయన డైరెక్టర్‌ మంచి గుర్తింపు పొందారు. అయితే తాజాగా ఆయన బాల‌కృష్ణ అంజలిని తోస్తున్న వీడియో చూసి దానిపై స్పందించాడు. ఆయన వీడియో తన ఎక్స్‌లో రీషేర్‌ చేస్తూ బాలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Hansal Mehta: కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరు? - బాల‌కృష్ణ, అంజలి వీడియోపై స్టార్‌ డైరెక్టర్‌ ఘాటు వ్యాఖ్యలు

ఆ వీడియోను తన ఎక్స్‌లో షేర్‌ చేస్తూ "కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరూ?(Who is this scumbag?)" అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన కామెంట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు హన్సల్‌ మెహతాకు సపోర్టు చేస్తూ బాలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్‌ అయితే "ఆయన ఎక్స్‌ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ కుమారుడు. ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా. అయితే ఆయనకు మెంటాలిటీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్‌ను ఉంది. అందువల్ల అతడు ఏం చేసిన ఇలా వివాదం అవుతుందంటూ ఆయన పోస్ట్‌పై కామెంట్‌ చేశారు. మరోవైపు ఈవెంట్‌లో బాలయ్య కూర్చుని ఉన్న చోట బాటిల్లో మందు ఉన్న విజువల్స్ కూడా వైరల్‌ అవుతున్నాయి. అయితే అక్కడ ఎలాంటి బాటిల్స్‌ లేవని, వాటిని సిజీ చేసి చూపిస్తున్నారంటూ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి నిర్మాత వివరణ ఇచ్చారు. 

Hansal Mehta: కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరు? - బాల‌కృష్ణ, అంజలి వీడియోపై స్టార్‌ డైరెక్టర్‌ ఘాటు వ్యాఖ్యలు

కాగా ఈ వీడియోపై గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ టీం స్పందించింది. ఈ మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరో విశ్వక్‌ సేన్‌ మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చారు. నేడు జరిగిన ప్రెస్‌ మీట్‌లో విశ్వక్ సేన్‌ మాట్లాడుతూ.. వైరల్‌ అవుతున్న ఆ వీడియోకి ముందు, వెనక ఏం జరిగిందనేది చూస్తే సరిపోతుందని, అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుందన్నారు. ఇక నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. స్టేజ్‌పై మేమంతా మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణకు విశ్వక్, మీరు మరికొందరు అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. మిమ్మల్ని జరగమని చెబితే మీకు వినపడనప్పుడు. జరగమంటూ కాస్తా వెనక్కి అన్నారు. అది వారిద్దరి మధ్య ఉన్న చనువు వల్ల అలా జరిగింది. దాన్ని కొందరు కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారు. అది జరిగిన తర్వాత హీరోయిన్‌ అంజలి, బాల‌కృష్ణ గారు హైఫైవ్‌ కూడా ఇచ్చుకున్నారు. ఆ వీడియో ఎందుకు చూపించడం లేదు" అని ఆయన వివరణ ఇచ్చారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget