సినీ నటి, హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు

ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చిన ఈ బ్యూటీ మూడు పదుల వయసులోనూ పెళ్లి చేసుకోలేదు

కానీ తన పెళ్లిపై మాత్రం తరచూ ఏదోక వార్త సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉంటుంది

తాజాగా తన పెళ్లి రూమార్స్‌పై అంజలి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది

ఇప్పటికే సోషల్‌ మీడియా నాకు నాలుగు, ఐదు పెళ్లిళ్లు చేసిందంటూ నవ్వుతూ మాట్లాడింది

మొదట్లో ఇలాంటి రూమర్స్‌ వస్తే ఇంట్లో వాళ్లు చాలా కంగారు పడేవాళ్లు... ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అయ్యాననే పుకారు కూడా సృష్టించారు

అవి చూసి అమెరికాలో ఉన్న మా అక్క ఫోన్‌ చేసి పెళ్లయ్యిందా? అని అడిగింది..

నా పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ వల్ల.. నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు

Image Source: All Image Credit: yours_anjali/Instagram

కానీ, పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదంటూ స్పష్టం చేసింది