(Source: ECI/ABP News/ABP Majha)
డాన్, లేడీ డాన్ - స్క్రీన్ మీద గ్యాంగ్‌స్టర్స్‌గా అదరగొట్టిన బాలీవుడ్ హీరోయిన్లు
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా గ్యాంగ్ స్టర్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. వారిలో ఆలియా భట్, శ్రద్ధా కపూర్, ఈషా తల్వార్ లాంటి హీరోయిన్స్ కూడా ఉండడం విశేషం.
సినీ ఇండస్ట్రీలో వెండితెరపై ఎలాంటి పాత్రలు పోషించాలన్న వారిలో బాలీవుడ్ నటీనటులు ముందు వరుసలో ఉంటారు. అలా ఇప్పటికే చాలామంది బాలీవుడ్ స్టార్స్ కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ రోల్స్ ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిందే కదా. మామూలుగా గ్యాంగ్ స్టర్ రోల్స్ ఎక్కువ హీరోలు చేస్తుంటారు. కానీ బాలీవుడ్ లో మాత్రం కొంతమంది హీరోయిన్లు కూడా గ్యాంగ్ స్టర్ రోల్స్ చేసి అదరగొట్టారుమ్ ఆ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాలో గ్యాంగ్ స్టర్ రోల్స్ చేశారు? అనేది తెలుసుకుందాం..
1. రిచా చద్దా - ఫక్రే(Fukrey) : సక్రే సినిమాలో రీఛార్జ్ చేద్దాం ఢిల్లీ గ్యాంగ్స్టర్ అయిన బోరి పంజాబ్ పాత్రను పోషించింది సినిమాలో ఆమె ఫైరింగ్ ఆటిట్యూడ్ తో గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టింది ఈ సినిమాలో రిచా పోషించిన గ్యాంగ్ స్టార్ పాత్ర బాలీవుడ్ ఆడియన్స్ కి గుర్తుండిపోయింది సినిమాలో రిక్షా పోషించిన బోలి పంజాబ్ పాత్ర ని గ్యాంగ్ స్టార్ సోనూ పంజాబన్ రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి తీసుకున్నారు.
2. ఆలియా భట్ - గంగుబాయి కథియావాడి : వ్యభిచారంలో మాఫియా క్వీన్ గా ఎదిగిన గంగుబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అలియా భట్ గంగుబాయి గా ఒదిగిపోయింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఆలియా కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. హుస్సేన్ జైధి రచించిన 'మాఫియా క్వీన్' అనే పుస్తకం నుండి ప్రేరణ పొంది డైరెక్టర్ బన్సాలి ఈ సినిమాను తీశారు.
3. కృతిక కమ్రా - బంబై మేరీ జాన్ : బాలీవుడ్ లో తన వర్సటైల్ యాక్టింగ్ తో నటిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న కృతిక కమ్ర 'బంబై మేరీ జాన్' సిరీస్లో గ్యాంగ్ స్టర్ సోదరి పాత్రను పోషించింది. దారా అనే గ్యాంగ్ స్టార్ సోదరి హాబీబా పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. 'డోంగ్రీ టు దుబాయ్' అనే కల్పిత పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని అవతారంలో ఆడియన్స్ను ఆకట్టుకుంది కృతిక. అంతేకాదు కృతిక కు తన కెరీర్ లోనే ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు.
4. శ్రద్ధా కపూర్ - హసీనా పార్కర్ : అప్పటివరకు గ్లామరస్ హీరోయిన్గా అలరించిన శ్రద్ధా కపూర్ 'హసీనా పార్కర్' లో తన ట్రాన్స్ఫర్మేషన్ తో షాక్ ఇచ్చింది. సినిమాలో ప్రతినాయిక పాత్రలో అదరగొట్టింది. ముఖ్యంగా సినిమాలో ఆమె గ్యాంగ్ స్టార్ లుక్, పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
5. ఇషా తల్వార్ - సాస్ బహు ఔర్ ఫ్లెమింగో : ఈ సిరీస్ లో ఈషా తల్వార్ తన తల్లితో కలిసి డ్రగ్ సామ్రాజ్యం నడుపుతున్న 'బిజిలి' అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. 'బిజిలి' అనే పాత్ర డ్రగ్ మాఫియా లో భాగమే కాకుండా 'LGBTQ' కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈషా కి ఈ రోల్ ఓ సవాల్ గా మారింది. అయినా కూడా బిజిలీ పాత్రలో తన అసాధారణమైన నటనతో ప్రశంసలు అందుకుంది.
6. రాధిక మదన్ - సాస్ బహు ఔర్ ఫ్లెమింగో : ఈ సిరీస్లో డ్రగ్ మాఫియా ప్రపంచంలో భాగమైన ఈశా తల్వార్ తో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది రాధిక మదన్. సిరీస్లో రాధిక మదన్ తోనే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇందులో తన తల్లి డ్రగ్ సామ్రాజ్యంలో చురుగ్గా పాల్గొనే 'శాంత' అనే పాత్రను రాధిక పోషించింది. ఈ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
7. నేహా దూపియా పాస్ గయేరే ఒబామా : 2010లో వచ్చిన ఈ మూవీలో నేహా ధూపియా మూస పద్ధతులను బద్దలు కొట్టి శాశ్వత ప్రభావాన్ని చూపే పాత్రను పోషించింది. సినిమాలో మున్నీ మేడంగా పురుషుల పట్ల తీవ్ర శత్రుత్వంతో కూడిన భయంకరమైన గ్యాంగ్ స్టార్ గా నటించింది. మున్నీ మేడం పాత్రలో నేహా ధూపియ తన పవర్ఫుల్ అండ్ ఫియర్లెస్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో సీనియర్ హీరోయిన్‌కు కీలక పాత్ర?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial