Sonakshi Sinha: 16 నెలల ప్రెగ్నెన్సీ... వరల్డ్ రికార్డు - రూమర్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ సెటైరికల్ రియాక్షన్
Sonakshi Sinha Reaction: తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Bollywood Actress Sonakshi Sinha Reaction On Pregnancy Rumours: తనకు ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్లపై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యారు. ఇది నిజంగా వరల్డ్ రికార్డు అంటూ ఇన్ స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
16 నెలల ప్రెగ్నెన్సీ... వరల్డ్ రికార్డు
రీసెంట్‌గా సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫోటోలకు ఫోజులిస్తున్న టైంలో ఆమె తన పొట్ట భాగాన్ని కవర్ చేస్తూ కనిపించడంతో ప్రెగ్నెంట్ అనే రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై బాలీవుడ్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ కూడా చెబుతూ పోస్టులు చేశారు. ఈ వార్తలపై తాజాగా సోనాక్షి స్పందిస్తూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. '16 నెలలకు పైగా ప్రెగ్నెంట్‌గా ఉండడం వరల్డ్ రికార్డు. ఉదర భాగంపై చెయ్యి వేసి ఫోటో దిగినందుకు బేబీ బంప్ కవర్ చేస్తున్నట్లుగా కొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. వాటికి మా ఆన్సర్ ఇదే.' అంటూ రాసుకొచ్చారు. అయితే, గత ఏడాది కాలంగా ఈమె ప్రెగ్నెన్సీపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దీంతోనే సోనాక్షి ఇలా తనదైన శైలిలో సెటైరికల్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
గతంలోనూ సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. 2024లో సోనాక్షి సిన్హా, జహీర్‌ల వివాహం జరగ్గా... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఆమె వెళ్లగా... ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లోనే దీనిపై క్లారిటీ ఇచ్చినా బరువు పెరగడంతో మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఫోటోస్‌లో బేబీ బంప్ కవర్ చేసుకుంటున్నారంటూ ప్రచారం జరగ్గా దానిపై నటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం సోనాక్షి సిన్హా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'జటాధర' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ధన పిశాచి' అంటూ సాగే సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా... రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.





















