Saamrajyam Movie Promo: ఎన్టీఆర్ అయితే పెర్ఫార్మెన్స్ కుమ్మేస్తాడు - డిఫరెంట్‌గా శింబు 'సామ్రాజ్యం' ప్రోమో
Saamrajyam Movie: కోలీవుడ్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'అరసన్'. తెలుగులో 'సామ్రాజ్యం'గా ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.

Simbu's Saamrajyam Movie Promo Released: కోలీవుడ్ స్టార్ శింబు, ఫేమస్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'అరసన్'. తెలుగులో ఈ మూవీ 'సామ్రాజ్యం'గా రిలీజ్ కానుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ రూపొందిస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అదిరిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ మూవీ తెలుగు ప్రోమోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
5 నిమిషాల ప్రోమో... హీరో ఇంట్రడక్షన్
సాధారణంగా ఏ మూవీ ప్రోమో అయినా 3 నిమిషాలు ఉంటేనే ఎక్కువ. కానీ 'సామ్రాజ్యం' మూవీ ప్రోమో 5 నిమిషాల 35 సెకన్లు ఉంది. ప్రోమోలో హీరో ఇంట్రడక్షన్ చూపించడం సహా జూనియర్ ఎన్టీఆర్ పేరును సైతం వాడేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలుస్తుండగా ప్రోమోతోనే హైప్ క్రియేట్ చేశారు.
ఓ హత్య కేసులో అరెస్టైన హీరో శింబు... ఓ మూవీ డైరెక్టర్‌గా తన కేసు గురించి వివరాలను చెప్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. ఓపెన్ చేయగానే... వర్షంలో నిల్చున్న శింబు... 'సార్ నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. కానీ మీరలా చూపించొద్దు. మామూలుగా కార్డ్ వేస్తుంటారు కదా. ఈ సినిమాలో వచ్చేదంతా ఒట్టి బూటకం అని అట్టాంటిది ఓ కార్డ్ వేసేయండి.' అనే డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. 'నేను చెప్పబోయే మ్యాటర్‌లో సగానికి పైగా కోర్టులోనే ఉంది సార్. నేను సిల్లీగా నిజం చెప్పబోయి మీరు సినిమా తీస్తే ఇక అంతే. ఇది బయటకు వస్తే మనలాంటి ఇన్నోసెంట్స్ మాత్రమే కాకుండా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, లాయర్స్, జడ్జీలు కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉంది.' అంటూ చెప్పడం హైప్ క్రియేట్ అవుతుంది.
Also Read: దీపావళి ఎంటర్‌టైన్మెంట్ - 'కిష్కింధపురి' నుంచి 'దక్ష' వరకూ... ఒకే రోజు ఓటీటీల్లో 21 మూవీస్
ఎన్టీఆర్‌తో చేయించండి
'మన వేషం ఎవరు వేయబోతున్నారు సార్?' అంటూ శింబు అడగ్గా... 'మీ మైండ్‌లో ఎవరో ఉండుంటారే' అంటూ డైరెక్టర్ చెబుతాడు. 'ఎన్టీఆర్‌తో చేయించండి సార్. పెర్ఫార్మెన్స్ కుమ్మి వదిలిపెడతాడు.' అంటూ శింబు చెప్పడం ఆసక్తిని పెంచేసింది. ఒకే రాత్రి ముగ్గురిని హత్య చేసిన కేసులో శింబును అరెస్ట్ చేయగా... అసలు ఆ హత్యలు చేసిందెవరు? శింబునే చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ సామ్రాజ్యంలో ఎవరి పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఈ మూవీని 'V Creations' బ్యానర్‌పై కలైపులి ఎస్.థామ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రిలీజ్ చేయనుంది. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















