Bhaje Vayu Vegam: పెద్దలతో పిల్లలు బండెక్కొచ్చు - ‘భజే వాయు వేగం‘ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
Kartikeya Gummakonda: కార్తికేయ గుమ్మకొండ తాజాగా చిత్రం ‘భజే వాయు వేగం‘ మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ అధికారులు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ నెల 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bhaje Vaayu Vegam Movie censored with U/A: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం‘. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ టీమ్ యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చింది. ఈ మేరకు చిత్రం బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘లైసెన్స్ పొందిన బ్రాండ్ న్యూ కారు థియేటర్లలో రెసింగ్ కు రెడీ అయ్యింది. ‘భజే వాయు వేగం‘ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. పిల్లలు.. పెద్దలు బండెక్కొచ్చు’’ అని వెల్లడించింది.
ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ ‘భజే వాయు వేగం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు... అజయ్ కుమార్ రాజు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న ‘భజే వాయు వేగం’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సత్యభామ’ ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ‘గం గం గణేశా’తో పాటు చాందిని చౌదరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ బరిలోకి దిగుతుంది.
నా కెరీర్ లో మరో బెంచ్ మార్క్ - కార్తికేయ
‘RX100’ తర్వాత తన సినీ కెరీర్ కు ‘భజే వాయు వేగం’ మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుందని కార్తికేయ వెల్లడించారు. “ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎక్కువగా ఎదురు చూసిన సినిమా ‘భజే వాయు వేగం’. ఎమోషన్, డ్రామా, నా క్యారెక్టరైజేషన్ అన్నీ వందకు వంద శాతం కుదిరిన సినిమా ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కథలోని లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా ప్రేక్షకుల మదిని తాకుతాయి. ‘RX 100’ తర్వాత నాకు ‘భజే వాయు వేగం’ మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది” అని కార్తికేయ తెలిపారు.
ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే మధు శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. సత్య జి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రథన్ మ్యూజిక్ అందించగా, కపిల్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.
View this post on Instagram
Read Also: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!