అన్వేషించండి

Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?

Rahul Banerjee Death : బెంగాళీ నటుడు రాహుల్ బెనర్జీ ఒడిశాలోని బీచ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన నీటిలో పడిపోయారు.

Bengali Serial Actor Rahul Banerjee Died In Drown Accident : బెంగాళీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మృతి చెందారు. సీరియల్ షూటింగ్ జరుగుతున్న టైంలో జరిగిన నీటి ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ టైంలో ఊహించని ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాహుల్ తన తాజా షో 'భోలే బాబా పార్ కరేగా' షూటింగ్ నిమిత్తం ఒడిశాలోని తలసరి బీజ్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం షూటింగ్ చేస్తుండగా... నీటిలో పడవపై వెళ్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షూటింగ్‌పై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, పర్మిషన్ కూడా తీసుకోలేదని ఒడిశా పోలీసులు తెలిపారు. దీనిపై తలసరి, దిఘా అధికారులు కలిసి విచారణ చేస్తున్నారు. 43 ఏళ్ల వయసులో ప్రముఖ నటుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంపై బెంగాళీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సహచర నటులు, ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Also Read : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం - విలక్షణ నటుడికి మాతృ వియోగం

సీఎం దిగ్భ్రాంతి

రాహుల్ బెనర్జీ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని... రాహుల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

భార్య ప్రియాంక ఎమోషనల్ నోట్

రాహుల్ మరణ వార్తపై ఆయన భార్య ప్రియాంక సర్కార్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. ఇది తమకు అత్యంత బాధాకరమైన సమయమని, తమ ప్రైవసీ గౌరవించాలని కోరారు. 2010లో ప్రియాంకను రాహుల్ వివాహం చేసుకోగా వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 2017లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరేళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొడుకు కోసం అన్నింటినీ పక్కన పెట్టి మళ్లీ ఒక్కటయ్యారు. 

రాహుల్ సినీ కెరీర్

కోల్‌కతాలో జన్మించిన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ చిన్నప్పటి నుంచీ నటనపై మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు. 2008లో వచ్చిన 'చిరోదిని తుమీ జే అమర్' మూవీతో బిగ్ ఫేమ్ అయ్యారు. బెంగాళీ ఇండస్ట్రీలో ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత లవ్ సర్కస్, షానో మాన్ బోలీ తొమయ్, నా హన్యతే, జాక్ పాట్, లవ్ సర్కస్ వంటి మూవీస్‌తో మెప్పించారు.

అలాగే, దేశార్ మాటీ, గీతా ఎల్ఎల్‌బీ, తుమీ అస్బే బోలే సీరియల్స్‌లోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా రూపొందించారు. కెరీర్ పరంగా మంచి స్థానంలో ఉండగా ఈ ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Embed widget