Prakash Raj Mother : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం - విలక్షణ నటుడికి మాతృ వియోగం
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో ఆయన మాతృమూర్తి కన్నుమూశారు.

Prakash Raj Mother Suvarnalatha Passed Away : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణ లత (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె బెంగుళూరులోని నివాసంలో సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కన్నడకు చెందిన ప్రకాష్ రాజ్ సొంత భాషతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన విలక్షణ నటనతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మూవీలో కీలక పాత్రతో పాటు వారణాసిలో శివ భక్తుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
ట్రెండింగ్ వార్తలు






















