News
News
వీడియోలు ఆటలు
X

'నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, యంగ్ టైగర్ కూడా నాకు దేవరే'.. బండ్ల ట్వీట్ వైరల్!

'దేవర' టైటిల్ ను తన నుంచి కొట్టేశారని బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడటంతో, బండ్ల మరో ట్వీట్ తో వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన వ్యవహారశైలితో, ట్వీట్స్ తో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే బండ్ల.. అప్పుడప్పుడు వివాదాలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతుంటారు. ఇప్పుడు లేటెస్టుగా 'దేవర' సినిమా టైటిల్ గురించి ట్వీట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పవర్‌ ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 'NTR30' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఖరారు చేసారు. తారక్ బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ శుక్రవారం సాయంత్రం టైటిల్ ను అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేసారు. అయితే తన టైటిల్ ను కొట్టేశారంటూ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో బండ్ల మరో ట్వీట్ పెట్టి వార్తల్లో నిలిచాడు. 

'దేవర' టైటిల్‌ ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించకముందే, అదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా జోరుగా ప్రచారం చేయబడింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.. ''దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్, నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు'' అని పేర్కొంటూ కోపంతో ఉన్న ఎమోజీ పోస్ట్ చేసాడు. దీంతో బండ్ల పై ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను రెన్యూవల్ చేసుకోకపోతే, ఆ టైటిల్ ను వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చని ఒక నిర్మాతగా నీకు తెలియదా? కొట్టేశారని ఎలా అంటావ్? అంటూ ట్రోల్ చేసారు. 

గతంలో తారక్ తో 'బాద్ షా' 'టెంపర్' వంటి చిత్రాలను నిర్మించారు బండ్ల గణేష్. ఆ సమయంలో హీరో నిర్మాతలకు మధ్య విబేధాలు వచ్చాయనే టాక్ ఉంది. 'టెంపర్' తర్వాత బండ్లను ఎన్టీఆర్ ఇంట్లోకి కూడా రానివ్వలేదని హీరో సచిన్ జోషి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో సంచలనం అయింది. అవన్నీ గుర్తు పెట్టుకునే ఇప్పుడు 'దేవర' టైటిల్ తనదేనంటూ అక్కసు వెళ్లగక్కుతున్నాడంటూ తారక్ ఫ్యాన్స్ గణేష్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. దీంతో వెంటనే నిర్మాత మరో ట్వీట్ తో అభిమానులను శాంతింపజేసే ప్రయత్నం చేసారు. 

''నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా, ఆయన కూడా నాకు దేవరే'' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. దీనికి లవ్ సింబల్ ను జత చేసాడు. 'దేవర' నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత, ''సూపర్ గా ఉంది'' అంటూ మరో ట్వీట్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో బండ్ల గణేష్ 'దేవర' అని సంభోదిస్తూ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో సినిమా చేయడానికి అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నాడు కానీ, రెన్యూవల్ చేసుకోలేదు. దీంతో అదే టైటిల్ ను కొరటాల శివ తన సినిమా కోసం ఫిక్స్ చేసుకున్నారు. 

ఇదంతా పక్కన పెడితే, ఎప్పుడూ కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే 'దేవర' అంటూ పొగిడే బండ్ల గణేష్.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తనకు దేవరే అని ట్వీట్ చేయడం నెట్టింట చర్చనీయంగా మారింది. ఇటీవల కాలంలో బండ్లను పవన్ దూరం పెట్టాడనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తారక్ ను దేవర అని సంబోధించడం ఆలోచించాల్సిన విషయమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ తో హ్యాట్రిక్ మూవీ చేసే ప్లాన్ లో ఉన్నారేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. 

కాగా, కమెడియన్ నుంచి ప్రొడ్యూసర్ గా టర్న్ తీసుకున్న బండ్ల గణేశ్.. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అయితే 2015లో వచ్చిన 'టెంపర్' తర్వాత సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. 'సర్కారు వారి పాట' చిత్రంతో మళ్లీ తెర మీదకు తిరిగొచ్చిన బండ్ల.. 'డేగల బాబ్జీ' అనే మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. 'సన్నాఫ్ ఇండియా' సినిమాలోనూ కనిపించారు.

Read Also: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు దిగ్గజాలు - 'లాల్ సలామ్'లో రజినీతో ఇండియన్ క్రికెట్ లెజెండ్

Published at : 20 May 2023 07:59 AM (IST) Tags: Tollywood News Koratala Shiva Bandla Ganesh NTR DEVARA Devara Title Devara Firat Look Bandla Ganesh Shocking Tweet

సంబంధిత కథనాలు

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?