Band Melam: బ్యాండ్ మేళం... 'కోర్ట్' జంట హర్ష్ రోషన్, శ్రీదేవి కొత్త సినిమా - టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది, చూశారా?
'కోర్ట్'తో యంగ్ పెయిర్ హార్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా టైటిల్ 'బ్యాండ్ మేళం'. ఇవాళ టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు.

'కోర్ట్' సినిమా విజయంతో యంగ్ పెయిర్ హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవీ అపల్లా (Sridevi Apalla) పాపులర్ అయ్యింది. ఇప్పుడు వాళ్లిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈ క్యూట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నది ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్. వాళ్ళిద్దరినీ ఓ అందమైన ప్రేమ కథనుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ సినిమాకు 'బ్యాండ్ మేళం' టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్) విడుదల చేశారు.
'బ్యాండ్ మేళం'లో మళ్ళీ జంటగా!
'కోర్ట్' విజయం తర్వాత హార్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా జంటగా నటిస్తున్న సినిమా 'బ్యాండ్ మేళం'. ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్... అనేది ఉప శీర్షిక. కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కావ్య, శ్రావ్య నిర్మాతలు. శివరాజు ప్రణవ్ సహ నిర్మాత. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
తెలంగాణ నేపథ్యంలో కొత్త ప్రేమకథ!
తెలంగాణ నేపథ్యంలో ఓ యువ జంట మధ్య అందమైన ప్రేమకథగా 'బ్యాండ్ మేళం' తెరకెక్కుతోందని టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. పేరుకు టైటిల్ గ్లింప్స్ అని చెప్పారు గానీ ఆల్మోస్ట్ 2 నిమిషాల విజువల్స్ విడుదల చేశారు.
'బ్యాండ్ మేళం' టైటిల్ గ్లింప్స్ చూస్తే... ఇదొక సంగీతభరిత ప్రేమకథా చిత్రమని అర్థం అవుతోంది. ఇందులో రాజమ్మ పాత్రలో శ్రీదేవి, యాదగిరిగా హార్ష్ రోషన్ నటించారు. ఇద్దరూ బావా మరదళ్ళు అని అర్థం అవుతోంది. హీరోయిన్ కోసం హీరో ఒక ట్యూన్ కట్టడం చూపించారు. పల్లెటూళ్ళో వాళ్ళిద్దరూ ఉన్నారు. తెలంగాణ పల్లె వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించారు.
తెలంగాణ యాసలో సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో ఈ 'బ్యాండ్ మేళం' టైటిల్ గ్లింప్స్ ప్రారంభమైంది. హార్ష్ రోషన్, శ్రీదేవి మధ్య తెలంగాణ యాసలో సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు - కథనం: శివ ముప్పరాజు, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల, నిర్మాణ సంస్థ: 'ఏ కోన వెంకట్ ప్రొడక్షన్' కోన ఫిల్మ్ కార్పొరేషన్, సమర్పణ: మ్యాంగో మాస్ మీడియా, నిర్మాతలు: కావ్య - శ్రావ్య, సహ నిర్మాత: శివరాజు ప్రణవ్, రచయిత - దర్శకుడు: సతీష్ జవ్వాజీ.
Also Read: త్వరలో ఓటీటీకి 'జూనియర్'... కిరీటి రెడ్డి, శ్రీ లీల సినిమా స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?





















