By: ABP Desam | Updated at : 15 Sep 2023 08:05 PM (IST)
'భగవంత్ కేసరి' సినిమాలో శ్రీలీల, బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయదశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ విషయం ప్రేక్షకులకు తెలుసు. అయితే... ఇటీవల తెలుగులో కొన్ని పెద్ద చిత్రాలు అనుకున్న తేదీకి రావడం లేదు. వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
వాయిదాలు లేవమ్మా - అక్టోబర్ 19నే సినిమా!
'భగవంత్ కేసరి' సినిమా విడుదల వాయిదా వేసే ప్రసక్తి లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అదీ సంగతి! ఇటీవల సినిమా నుంచి మొదటి పాట 'గణేష్ యాంథమ్' విడుదల చేశారు. దానికి వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
తీన్మార్ కాదు... సౌమార్ కొట్టు!
వినాయక చవితి పండగ నేపథ్యంలో 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్'ను తెరకెక్కించారు. ఆల్రెడీ విడుదలైన సినిమా ప్రచార చిత్రాలు చూస్తే... బాలకృష్ణ తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపించారు. ఇప్పుడీ పాటను కూడా తెలంగాణ నేపథ్యంలో జరిగే గణేష్ ఉత్సవాల తరహాలో తెరకెక్కించారు.
'జై బోలో గణేష్ మహారాజ్ కి' అంటూ సాంగ్ మొదలైంది. ఆ తర్వాత పిల్లల మధ్యలో స్టెప్పులు వేస్తున్న శ్రీ లీలను చూపించారు. తర్వాత బాలకృష్ణను చూపించారు. పసుపు రంగు షర్టు, కళ్ళజోడుతో ఆయన ఎంట్రీ అదిరింది.
తీన్మార్ కొడుతుంటే 'బిడ్డా! ఆనతలేదు. సప్పుడు జర గట్టిగా చేయమను' అని బాలకృష్ణ అడగడం... అప్పుడు శ్రీ లీల 'అరే తీసి పక్కన పెట్టండ్రా మీ తీన్మార్! మా చిచ్చా వచ్చిండు! ఎట్లా ఉండాలే! కొట్టరా కొట్టు... సౌమార్' అనడం బావుంది. పాట మీద అంచనాలు మరింత పెంచింది. ఈ పాట, లిరికల్ వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ట్రెండింగ్ పొజిషన్ లో ఉంది. బాలకృష్ణ, శ్రీ లీల వేసిన స్టెప్పులు అభిమానులు, ప్రేక్షకుల్లో జోష్ నింపేలా ఉన్నాయి.
Also Read : 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?
'భగవంత్ కేసరి' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రధారి. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>