Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
Balakrishna Chandrababu Naidu: 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' 4 మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు అతిథిగా వచ్చారు. ఆల్రెడీ ఆ సీజన్ ప్రోమో విడుదల చేశారు. మరి, బాలయ్య ఏ ప్రశ్నలు అడిగారో తెలుసా?
Unstoppable With NBK Season 4 First Episode Highlights: 'మా బావ గారు, మీ బాబు గారు' అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చినా... తనదైన శైలిలో ప్రశ్నలు వేయడంలో నారా చంద్రబాబు నాయుడుకు నట సింహం నందమూరి బాలకృష్ణ డిస్కౌంట్లు ఏవీ ఇవ్వలేదని 'ఆహా' వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సమయస్ఫూర్తితో సమాధానాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు, పలు వివాదాస్పద ప్రశ్నలకు తన జవాబులు ఇచ్చారట. ఇంతకీ, చంద్రబాబును బాలయ్య ఏం ప్రశ్నలు అడిగారో తెలుసా?
పవన్ కల్యాణ్ పొత్తు ప్రస్తావన...
ఆహా ఓటీటీ సంస్థ 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కోసం చంద్రబాబును తీసుకు వచ్చింది. ఆల్రెడీ విడుదలైన ప్రోమో వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అయితే అంతకు మించి అనేలా ఎపిసోడ్ ఉంటుందట.
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు గురించి చంద్రబాబును బాలకృష్ణ ప్రశ్నలు అడిగారు. ''పవన్ చెప్పిన ఏ మాటలు చంద్రబాబును ఇంప్రెస్ చేశాయి? జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?'' అనేది అందులో ఒకటి. మరో ప్రధాన ప్రశ్న... ''రాజకీయాల్లో ఎవరినీ నమ్మని మీకు, జనసేనానితో అంత స్ట్రాంగ్ బాండ్ ఎలా ఏర్పడింది? సింపతీ నుంచి ప్రేమ పుట్టిందా? పవన్ తో ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెబుతారు?'' అనేది! రాజకీయాల్లో చంద్రబాబు ఎవరినీ ఎందుకు నమ్మరు? అనేది కాస్త కఠినమైన స్టేట్మెంట్. 'ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు గారు, కళ్యాణ్ బాబు' అని ప్రోమోలో అడిగిన ప్రశ్నకు ఏం జవాబు చెప్పారో చూడాలి.
లోకేష్, పవన్... ఎవరంటే ఇష్టం బాబు గారూ?
షోకి వచ్చిన అతిథిని చిక్కుల్లో పెడుతూ ప్రశ్నలు అడగటం బాలయ్య స్టైల్. ఆల్రెడీ విడుదలైన ప్రోమో చూస్తే... 'భువనేశ్వరి, బ్రాహ్మణి - ఇద్దరిలో బాస్ ఎవరు?' అని అడిగారు. అసలు విషయం అది కాదు... ''అబ్బాయి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్, బాలయ్య - ముగ్గురిలో మీకు ఎవరంటే ఇష్టం? మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు?'' అని బాలయ్య అడిగారట. మరి, చంద్రబాబు ఏం జవాబు చెప్పారో చూడాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి కూడా డిస్కషన్ వచ్చిందని టాక్. ఇంకా రాజధాని అమరావతి, గ్రామస్థాయిలో జనసేన, టీడీపీ మధ్య సమన్వయ లోపంతో పాటు జనసేనను తెలుగు దేశం నాయకులు ఎలా చూస్తున్నారు? వంటి విషయాలు చర్చకు వచ్చినట్టు టాక్.
Two unstoppable forces, one epic show! 💥🔥
— ahavideoin (@ahavideoIN) October 22, 2024
విజయసాధనలో పడ్డ ఇబ్బందులు,
జనసేనానితో తనకున్న అప్యాయతలు,
ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు,
బాలచంద్రుల ముచ్చట్లలో మీ ముందుకు!#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM.#Chandrababunaidu #UnstoppableWithNBK #NandamuriBalakrishna pic.twitter.com/V3UkpxyxoI
వైఎస్ జగన్ కక్షపూరిత రాజకీయాలు!
ఏపీ ఎన్నికలకు ముందు చంద్రబాబును అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేసింది. ఆయన్ను 53 రోజుల పాటు జైల్లో ఉంచింది. జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ పొత్తు ప్రకటించారు. ఆ పొత్తుతో పాటు వైఎస్ జగన్ వైఖరి గురించి ప్రస్తావన వచ్చిందట.
''జైలు జీవితం మీలో సీమ పౌరుషాన్ని నిద్ర లేపిందా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపించి కక్ష తీర్చుకోవాలనే కసి కలిగిందా?'' అని అసలు ఎటువంటి మొహమాటం లేకుండా చంద్రబాబును బాలయ్య అడిగారని వినబడుతోంది. అది మాత్రమే కాదు... ''మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు రెడీ చేసిన ఫైల్స్ ఏంటి?'' అని కూడా అడిగారట. జైలు జీవితం చంద్రబాబులో మరో మనిషిని బయటకు తీసుకు వస్తుందా? జగన్ కక్షపూరిత రాజకీయాలు చేశారని చెప్పిన ఆయన... ప్రత్యర్థి పార్టీ మీద ఎటువంటి బాణాన్ని సందించబోతున్నారు? జగన్ పట్ల ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఏం చెబుతున్నారు? వంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా బాలయ్య అడిగారని తెలిసింది.
చంద్రబాబు 53 రోజుల జైలు జీవితంతో పాటు గత ప్రతిపక్ష నాయకుడిగా చివరి ఐదేళ్లల్లో ఎదుర్కొన్న పరిణామాలు తర్వాత ప్రత్యర్థులకు దూకుడుగా సమాధానం ఇస్తారా? లేదంటే ఎప్పటిలా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారా? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు... నిందితుడిగా ఆ జైలు గదుల్లో గడపాల్సి రావడం పట్ల ఆయన ఫీలింగ్ ఏమిటి? రాజమండ్రి జైల్లో వీఐపీగా గడిపారా? భయంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు? వంటి ప్రశ్నలకు సైతం చంద్రబాబు జవాబులు ఇచ్చినట్టు వినబడుతోంది. ఆ జైలు ప్రపంచం, అక్కడ చదివిన పేపర్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చిందట.
Also Read: 'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!