Avika Gor: పెళ్లిపై ట్రోలింగ్స్, కామెంట్స్ - ఎక్స్‌పెక్టెడ్ అంటూ అవికా గౌర్ స్ట్రాంగ్ రియాక్షన్
Avika Gor Milind: తమ పెళ్లి తంతుపై వస్తోన్న విమర్శలపై హీరోయిన్ అవికా గౌర్, మిళింద్ కపుల్ తాజాగా రియాక్ట్ అయ్యారు. ట్రోలింగ్స్, విమర్శలు ముందే ఎక్స్‌పెక్ట్ చేసినట్లు చెప్పారు.

Avika Gor Milind Couple Strong Reaction On Trollings Against Their Wedding: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం అవికా గౌర్, ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిళింద్ చంద్వానీతో ఇటీవలే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ జంట ఓ టీవీ రియాలిటీ షోలో వివాహం చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. అంతే కాకుండా ఆమె వెడ్డింగ్ లుక్‌పైనా ట్రోలింగ్స్ వచ్చాయి. కామెంట్స్, ట్రోలింగ్స్‌పై ఈ జంట తీవ్రంగా స్పందించారు.
'ట్రోలింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేశాం'
టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనేది తన చిన్న నాటి కోరిక అని అవికా తెలిపారు. 'ఇలా పెళ్లి చేసుకోవాలని నా నిర్ణయాన్ని మిళింద్‌కు చెప్పినప్పుడు ఆయన అంగీకరించారు. ప్రజలు, నెటిజన్ల నుంచి ట్రోలింగ్స్, విమర్శలు రావొచ్చు అని ముందే చెప్పారు. డబ్బుల కోసమే అలా చేస్తున్నామనే ట్రోలింగ్ వస్తుందని ఊహించారు. కానీ, నా డెసిషన్‌పై మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. మిళింద్ అంగీకారమే నాకు ముఖ్యం. ఇతరులు గురించి నేను పట్టించుకోను.
ఇక నా పెళ్లి తంతు మొత్తం సంప్రదాయబద్ధంగా జరిగింది. అందుకే కొందరు నా వెడ్డింగ్ లుక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ట్రోలింగ్స్ నా భర్త లుక్‌పై వచ్చుంటే నేను చాలా బాధ పడేదాన్ని. ఆయన లుక్ నేనే డిజైన్ చేశాను. అలా రానందుకు ఆనందంగా ఉంది.' అంటూ చెప్పారు. ఇదే అంశంపై అవికా భర్త మిళింద్ స్పందించారు. 'ఈ రోజుల్లో పెళ్లి అంటే కనీసం 50 మంది ఫోటోగ్రాఫర్లు, వీడియో రికార్డు చేసే వారు లేకుండా జరగడం లేదు. అందరి పెళ్లిళ్లలోనూ ఇలాంటివి కామన్. అవికా మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఆమె చెప్పగానే అంగీకరించాను.' అని తెలిపారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: అసుర సంధ్య వేళ రాక్షసుల ఆగమనం - సుప్రీం హీరో 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ వేరే లెవల్
అవికా గౌర్, మిళింద్‌ల వివాహం ఓ హిందీ రియాలిటీ షోలో గత నెల 30న ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు వీరికి విషెష్ చెబుతూనే... రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటూ ట్రోలింగ్స్ చేశారు. వీటిపై తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ కపుల్. 2008లో వచ్చిన 'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు అవికా. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3 తెలుగు మూవీస్‌లో నటించారు. రీసెంట్‌గా షణ్ముఖ మూవీలోనూ నటించారు.





















