(Source: ECI | ABP NEWS)
Sambarala Yetigattu Glimpse: అసుర సంధ్య వేళ రాక్షసుల ఆగమనం - సుప్రీం హీరో 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ వేరే లెవల్
Sambarala Yetigattu: సుప్రీమ్ యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ వచ్చేసింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కింది.

Sai Durgha Tej's Sambarala Yetigattu Glimpse Out: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ లేటెస్ట్ పాన్ ఇండియా లెవల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సంబరాల ఏటిగట్టు' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. హీరో బర్త్ డే సందర్భంగా 'అసుర ఆగమన' అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో సాయి తేజ్ అదరగొట్టారు.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కిస్తున్నట్లు టైటిల్‌ను బట్టే తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. బాంబులు చుట్టే రాక్షసులు, బానిసల్లా కొందరు వ్యక్తులు వారికి అండగా నిలబడే ఓ నాయకుడు. ఇదీ 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్‌లో చూపించిన స్టోరీ. 'అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం.' అంటూ సాయి దుర్గా తేజ్ చెప్పే డైలాగ్ వేరే లెవల్.
'ఒక మనిషి, ఒక భూమి, వాటిని బలంగా బంధించే రక్తం బంధం' అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో... భూమి కోసం అందులో దొరికే ఖనిజాల కోసం పోరాటంలా అనిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, మైథలాజికల్ టచ్, మాస్, యాక్షన్ అంశాలు అన్నీ కలిపి మూవీని తెరకెక్కించినట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతోంది. చీకటి నుంచి వెలుగులు నింపే పోరాటానికి సైన్యాన్ని సిద్ధం చేసే యోధుడిలా కండలు తిరిగిన దేహంతో సాయి దుర్గా తేజ్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మరో పవర్ ఫుల్ మాస్ ట్రీట్ రాబోతోంది.
ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా... శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి దుర్గా తేజ్‌తో పాటు జగపతిబాబు, ఐశ్వర్య లక్ష్మి, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.
'ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్' బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా... CG వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. పవర్ ఫుల్ స్టోరీని పాన్ వరల్డ్ స్థాయిలో చూపించేందుకు కృషి చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సాయి తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిదే. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
One man, One land, and the blood & bond that binds them strong ❤️🔥#SambaralaYetiGattu ASURA AAGAMANA GLIMPSE OUT NOW 🔥
— Primeshow Entertainment (@Primeshowtweets) October 15, 2025
— https://t.co/uVGIeqhiDJ
Happy Birthday Mega Supreme Hero @IamSaiDharamTej ❤️#HBDSaiDurghaTej 🫶#SYGMovie #SYG pic.twitter.com/XjcdYERpbq
Samabrala Yetigattu Technical Team: డైరెక్టర్: రోహిత్ కేపీ, నిర్మాతలు : కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, బ్యానర్ : ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, DOP: వెట్రి పళనిస్వామి, మ్యూజిక్ : అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియమ్.





















