Mirage OTT: ఓటీటీలోకి 'దృశ్యం' డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ - తెలుగులోనూ చూసెయ్యండి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mirage OTT Platform: 'దృశ్యం' డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ 'మిరాజ్' ఓటీటీలోకి రాబోతోంది. మలయాళం, తెలుగుతో పాటు దాదాపు 7 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Asif Ali's Mirage OTT Release On Sonyliv: 'దృశ్యం'... ఈ పేరు వింటేనే మనకు ఓ మంచి మిస్టరీ థ్రిల్లర్ గుర్తొస్తుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్నీ భాషల్లోనూ... ట్రెండ్ సెట్ చేసింది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండో మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన మరో క్రైమ్ థ్రిల్లర్ 'మిరాజ్' ఓటీటీలోకి రానుంది. ఐఎండీబీలో మంచి రేటింగ్ సాధించిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మలయాళ స్టార్ ఆసిఫ్ అలీ, 'ఆకాశమే హద్దురా' ఫేం అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఆసిఫ్, అపర్ణలతో పాటు హన్నా రేజీ కోషీ, అర్జున్ శ్యామ్ గోపన్, హకీమ్ షాజహాన్, సంపత్ కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్' సొంతం చేసుకోగా... ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ప్రతీ కథలోనూ రహస్యం దాగి ఉంటుంది. ఈ కథలో చాలా దాగి ఉంటుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
Also Read: మూవీ Or వెబ్ సిరీస్... డిఫరెంట్ లుక్‌లో ఫైర్ స్ట్రామ్ శ్రీలీల - కాస్త వెయిట్ చెయ్యాల్సిందే
స్టోరీ ఏంటంటే?
అభిరామి (అపర్ణ బాలమురళి), కిరణ్ (హకీమ్ షాజహాన్) లవర్స్. ఇద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కంటుండగా... అభిరామికి పీఎస్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ట్రైన్ యాక్సిడెంట్‌లో కిరణ్ చనిపోయాడని పోలీసులు చెబుతారు. దీంతో షాక్‌కు గురవుతుంది అభిరామి. అయితే, ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఓ హార్డ్ డిస్క్ గురించి అభిరామిని ప్రశ్నిస్తారు పోలీసులు. అది తమకు ఇవ్వాలంటూ ఇబ్బంది పెడతారు. వారితో పాటే కొందరు రౌడీల నుంచి కూడా ఆమెకు హార్డ్ డిస్క్ గురించి బెదిరింపులు వస్తాయి.
అసలు ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? కిరణ్ నిజంగా ట్రైన్ యాక్సిడెంట్‌లోనే చనిపోయాడా? హార్డ్ డిస్క్ వల్ల అభిరామికి ఎదురైన సమస్యలు ఏంటి? రౌడీలు, పోలీసుల బెదిరింపుల నుంచి ఆమె తనను తాను ఎలా కాపాడుకుంది.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















