Love Me Teaser: దెయ్యంతో డేటింగ్, రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది - ఉత్కంఠగా సాగిన ఆశిష్ 'లవ్ మీ' టీజర్
Love Me Teaser: తాజాగా రిలీజైన టీజర్ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఫుల్ డార్క్ థీమ్‌లో విడుదల చేసిన టీజర్ "భయం ఉన్న చోట రొమాన్స్ ఎంత ఎగ్జయిటింగ్ ఉంటుందో తెలుసా? అనే హీరో డైలాగ్ ఆసక్తిగా ఉంది.
Ashish Love Me Teaser Release: ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అశిష్. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు్, శిరీష్ వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అశీస్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని అచీతూచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాడు. ఎలాగేన ఓ బిగ్ హిట్ కొట్టాలని ఈసారి సరికొత్త కంటెంట్‌తో సిద్దమయ్యాడు. అదే 'లవ్ మీ' సినిమా. ‘If You Dare’ అనేది ట్యాగ్ లైన్. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ అరుణ్ తెరకెక్కిస్తున్నారు.
దెయ్యంతో రొమాన్సా!
హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. దెయ్యంతో హీరో ప్రేమ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించిననట్టుగా ఇటీవల టైటిల్ గ్లింప్స్‌తో హింట్ ఇచ్చారు. ఇప్పుడు టీజర్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజాగా లవ్ మీ టీజర్ అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన టీజర్ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఫుల్ డార్క్ థీమ్‌లో విడుదల చేసిన టీజర్ "భయం ఉన్న చోట రొమాన్స్ ఎంత ఎగ్జయిటింగ్ ఉంటుందో తెలుసా ప్రియా? అనే హీరో డైలాగ్ తో మొదలైంది. హీరో అలా అనడంతో హీరోయిన్ షాక్ అవుతుంది. "అలా అని దెయ్యంతో రొమాన్స్ చేయలేం కదా" అంటుంది. అయితే దెయ్యాన్ని డేటింగ్ పిలిచి చూద్దాం అంటూ వాయిస్ వస్తుండగా డార్క్ రూంలో ఎర్ర చీరలో దెయ్యం పరుగెడుతున్నట్టుగా చూపించారు.
ఇలా క్షణంక్షణం టీజర్ ఉత్కంఠ సాగింది. హారర్ థ్రిల్లర్ జానర్‌గా వస్తున్న లవ్ మీ టీజర్ ఆద్యాంతంగా ఆసక్తిగా సాగింది. ఇది చూసిన ఆడియన్స్ కథ చాలా డిఫరెంట్‌గా ఉందంటున్నారు. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌లో క్యూరియసిటి పెంచారు. ఇలాంటి వైవిధ్యమైన కథ యూత్‌ని ఇంప్రస్ చేస్తుందనడం సందేహం లేదు. మరి ఈమూవీ ఆశిష్‌కు బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందా? మళ్లీ నిరాశ పరుస్తుందో మూవీ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. “లవ్ మీ” సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్‌తో పాటు మూవీ టీం ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటుందట. కాగా, ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే మూవీ రిలీజ్ డేట్, ట్రైలర్ విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట.
Also Read: చిన్మయి వల్ల తమిళంలో వర్క్స్ తగ్గాయి, ఆ విషయంపై మాట్లాడటం మానేశా - భర్త రాహుల్ షాకింగ్ కామెంట్స్
Happy to launch the teaser of this very new and unique attempt. #LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' looks amazing.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) March 7, 2024
▶️ https://t.co/SAdsep2Ubc
Good luck to the entire team 🤝
@iamvaishnavi04 @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu @artkolla @naga_mallidi @DilRajuProdctns