అన్వేషించండి

Blood And Chocolate 2023 Movie : 'బ్లడ్ అండ్ చాక్లెట్‌'కూ తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ కావాలి - అర్జున్ దాస్

అర్జున్ దాస్ హీరోగా లెజెండరీ దర్శకుడు శంకర్ నిర్మించిన 'బ్లడ్ అండ్ చాక్లెట్‌' సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు.

తెలుగు ప్రేక్షకులకు అర్జున్ దాస్ (Arjun Das) తెలుసు. ఆయన గొంతుకూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. 'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన అర్జున్ దాస్ హీరోగా తమిళంలో లెజెండరీ దర్శకుడు శంకర్ నిర్మించిన సినిమా 'బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌' (Blood And Chocolate Movie). గతంలో 'ప్రేమిస్తే', 'వైశాలి', 'షాపింగ్ మాల్‌' చిత్రాలనూ ఎస్ పిక్చర్స్ పతాకంపై శంకర్‌ నిర్మించారు. దాంతో 'బ్లడ్ అండ్ చాక్లెట్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. 

తెలుగులోనూ 'బ్లడ్ అండ్ చాక్లెట్' ట్రైలర్ విడుదల
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'బ్లడ్ అండ్ చాక్లెట్'ను తెరకెక్కించారు. జాతీయ పురస్కార గ్రహీత వసంత బాలన్ దర్శకత్వం వహించారు. దుస్సారా విజయన్ హీరోయిన్. తెలుగులో ఎస్.ఆర్.డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ నాలుగు అద్భుతమైన పాటల్ని అందించారని చిత్ర బృందం పేర్కొంది. తమ సంస్థ ద్వారా సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన దేవసాని శ్రీనివాసరెడ్డి చెప్పారు. 

బ్ల‌డ్ అండ్ చాక్లెట్ & ప్రేమ‌ కూడా!
సాధార‌ణంగా బ్లడ్ అంటే మ‌న‌కు వ‌యొలెన్స్ గుర్తుకొస్తుంది కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే... బ్ల‌డ్ అండ్ చాక్లెట్ (Blood And Chocolate)తో పాటు ప్రేమ‌, అభిమానం కూడా అని దర్శకుడు వసంత బాలన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''తెలుగులో ఎస్.ఆర్‌.డి.ఎస్ పతాకంపై డి. శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కుమార్ 'బ్లడ్ అండ్ చాక్లెట్'ను విడుదల చేస్తున్నారు. 'ఖైదీ, మాస్ట‌ర్‌, విక్ర‌మ్'తో అర్జున్ దాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఆయ‌న రోల్ శక్తివంతంగా ఉంటుంది. యాంగ్రీ యంగ్ మేన్‌గా అన్నీ  భావోద్వేగాలను ఆయన అద్భుతంగా పండించారు. 'వెయిల్'తో జీవీ ప్ర‌కాష్‌ గారిని నేను ప‌రిచ‌యం చేశాను. అప్పుడే గొప్ప సంగీత దర్శకుడు అవుతాడ‌ని అనిపించింది. అతను జాతీయ పురస్కారం గెలుచుకోవడంతో పాటు వంద సినిమాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు. ''అర్జున్ దాస్ గొప్ప వాయిస్‌తో అద్భుతంగా న‌టించారు. ఆయనకు తెలుగులో ఎవ‌రు డబ్బింగ్ చెబుతారా? అని నేను ఆలోచిస్తుంటే... తెలుగులోనూ డ‌బ్బింగ్ చెబుతాన‌ని ముందుకు రావ‌డం చాలా హ్యాపీగా అనిపించింది'' అని మాటల రచయిత రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 

Also Read : హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా రెబల్ స్టార్... 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

'బ్ల‌డ్ అండ్ చాక్లెట్'కూ ఈ ప్రేమ కావాలి - అర్జున్ దాస్
అర్జున్ దాస్ మాట్లాడుతూ ''జాతీయ పురస్కార గ్రహీత వసంత బాలన్‌ గారితో ప‌ని చేయ‌టం ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకం. తెలుగు ప్రేక్ష‌కులు నన్ను ఎంత గానో ప్రోత్స‌హిస్తున్నారు. ఈ సినిమా విష‌యంలోనూ మీ ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. ''తమిళంలో డబ్బింగ్ చెప్పటానికి వెళ్లినప్పుడు తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా అక్కడ జరుగుతోంది. 'నాతో ఎందుకు తెలుగు డ‌బ్బింగ్ చెప్పించ‌లేదు' అని అడిగి... వేరే వాళ్ల‌తో చెప్పిస్తే, మళ్ళీ నేనే తెలుగులోనూ డ‌బ్బింగ్ చెప్పాను'' అని వనితా విజయ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కూడా పాల్గొన్నారు. 

Also Read : నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget