Anupama Parameswaran on Trolls: లిల్లీ పాత్ర చేసినందుకు దారుణంగా ట్రోల్ చేశారు - అవి చాలా బాధించాయి, లోగా ఫీలయ్యా
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తాజాగా ట్రోల్స్‌పై స్పందించింది. లిల్లీ పాత్ర చేసినందుకు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. అవన్ని చూసి చాలా లోగా ఫీల్ అయ్యాను. కానీ..
Anupama Parameswaran React on Trolls: భారీ అంచనాల మధ్య సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్వ్కేర్ నేడు రిలీజ్ అయ్యింది. డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరి 22న విడుదలైన డీజే టిల్లు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ తనమైన మాటతీరు, పంచ్ డైలాగ్స్‌తో అలరించాడు. సినిమాలో కథ, స్క్రీన్‌ప్లే లేకపోయిన ఒక్క తన డైలాగ్స్, మాటలతో మాయ చేశాడు సిద్దూ. కామెడీ, థ్రిల్లర్‌గా వచ్చిన ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన టిల్లు స్వ్కేర్ నేడు థియేటర్లోకి వచ్చి ట్రెమండస్ రెస్సాన్స్ అందుకుంది.
'మూవీ ఫస్ట్ నుంచి చాలా లో మూమెంట్స్ చూశాను'
ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రివ్యూతో సక్సెస్ వైపు దూసుకుపోతుంది. విడులైన అన్ని ఏరియాల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీ టీం సక్సెస్ మీట్‌ను పెట్టేసింది. ఈ ప్రెస్‌మీట్ మూవీ దర్శకుడు, నిర్మాతలు, హీరోహీరోయిన్ పాల్గొని ఆనందం వ్యక్తం చేసుకున్నారు. మూవీని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు క్రతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు ముందు తనని దారుణంగా ట్రోల్ చేశారని, అవి తనని చాలా బాధించాయని చెప్పింది. 'మూవీలో నా లుక్‌ని మాత్రమే చూసి జడ్జ్ చేశారు. అసలు నేను లిల్లి పాత్ర ఎందుకు చేశానన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ, జస్ట్ పోస్టర్స్, ట్రైలర్ చూసే నన్ను జడ్జ్ చేశారు. ఇంత గ్లామర్ అవసరమా అని ప్రశ్నించారు. అవన్ని చూసి నేను చాలా లో(low Feeling) కలిగింది. ఇక సినిమా తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను.
ఈ ప్రెస్‌మీట్‌కి కొన్ని క్షణాల ముందుకు వరకు కూడా ఆందోళనలోనే ఉన్న. కానీ మా టీం అంత వచ్చి సినిమా సక్సెస్ అని చెప్పగానే చాలా ఆనందపడ్డాను. ఇక స్వయంగా టిల్లు స్క్వేర్ మూవీకి వస్తున్న రివ్యూ, లిల్లి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇంతకాలం పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ సినిమా చూసి డీజే టిల్లు రాధిక(నేహా శెట్టి) ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని ప్రశంసించిందని చెప్పింది. ఇక ఈ సినిమా ఇంతమంచి ఆదరణ రావడం, లిల్లి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఈ క్రెడిట్ అంతా మా మూవీ బాయ్స్‌దే అని, వాళ్లందరికి చాలా చాలా థ్యాంక్స్ అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ సినిమా ముందు నుంచి చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను, కానీ అవన్ని నుంచి నన్ను వీరు బయటకు తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు నాకు ధైర్యం ఇస్తూ లిల్లికి చాలా సపోర్టు.. నిజంగా వారందరికి (టిల్లు స్క్వేర్ మూవీ టీం) కృతజ్ఞురాలిని అని చెప్పింది.
Also Read: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్ - ఏమన్నాడంటే..!