News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Ante Sundaraniki Promo Song:పెళ్లిలో తాళి, ఉంగరం మాయం, ‘అంటే సుందరానికి’ పెళ్లి కాదా? ఇదిగో ప్రోమో సాంగ్!

నాని, నజ్రియా జంటగా నటించిన 'అంటే సుందరానికీ' ప్రోమో సాంగ్ నేడు విడుదల అయ్యింది. ఇది ఎలా ఉంది? ఏంటి?

FOLLOW US: 
Share:

'అంటే సుందరానికీ' (Ante Sundaraniki Movie) చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 10... అనగా శుక్రవారం సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా ప్రోమో సాంగ్ విడుదల చేశారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ (Vivek Sagar) అందించిన బాణీకి 'సరస్వతి పుత్ర' రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాయగా... శంకర్ మహదేవన్, శ్వేతా మోహన్ ఆలపించారు.

'అంటే సుందరానికీ' ప్రోమో సాంగ్ మాంచి క‌ల‌ర్‌ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. ఒక్కసారి లిరిక్స్, సాంగ్ మధ్యలో డైలాగ్స్ గమనిస్తే... సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే గురించి హింట్ ఇచ్చారా? అనే డౌట్ కలుగుతోంది. 

'అంటే సుందరానికీ' సినిమాలో హీరోది బ్రాహ్మణ కుటుంబం. హీరోయిన్ ఏమో క్రిస్టియన్. ఆ రెండు సంప్రదాయాలను ప్రోమో పాటలో చూపించారు. హీరో 'చెంగుచాటు చేగువేరా', హీరోయిన్ 'విప్లవాల సితార' అంటూ వాళ్ళ క్యారెక్టరైజేషన్లను పరిచయం చేశారు. 'అటువారు ఆవకాయ ఫ్యాన్సు', 'ఇటు వీరు కేక్ అండ్ వైన్ ఫ్రెండ్సు' అంటూవాళ్ళిద్దరి ఫ్యామిలీల గురించి కూడా చెప్పారు. 

సుందరం, లీలా పెళ్లికి మధ్య ఆటంకాలు వచ్చాయేమో?... తాళిబొట్టు, పెళ్లి ఉంగరాలు మిస్ అయినట్టు పాటలో చూపించారు. 'సుందరానికి పెళ్లి అయినా కాకపోయినా ఏమైనా సెలబ్రేషనే. ఏంటి నమ్మడం లేదా? కావాలంటే థియేటర్లకు వచ్చి చూడు' అంటూ నానితో డైలాగ్ చెప్పించారు. మొత్తం మీద పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారెంటీ. నాని (Nani), నజ్రియా నజీమ్ (Nazriya Nazim Fahadh) జోడీ చూడముచ్చటగా ఉంది.  

Also Read: అంటే థియేటర్లలో నానికి ఎదురు లేదా? ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికీ' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మించారు. ఇందులో నదియా, నరేష్, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Also Read: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Published at : 06 Jun 2022 01:43 PM (IST) Tags: nani Vivek Sagar Nazriya Nazim Ante Sundaraniki Promo Song Ante Sundaraniki Story Revealed In Promo Song

ఇవి కూడా చూడండి

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం - మరి మన స్టార్స్?

Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం  - మరి మన స్టార్స్?

Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు

Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు

టాప్ స్టోరీస్

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో -  ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

BRS Party News: బీఆర్‌ఎస్ పార్టీని వెంటాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ల మృతి! 6 నెలల్లోనే ఇద్దరు

BRS Party News: బీఆర్‌ఎస్ పార్టీని వెంటాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ల మృతి! 6 నెలల్లోనే ఇద్దరు
×