అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chiranjeevi: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ఒక్క రూపాయి తీసుకోలేదట. నిర్మాతకు డబ్బులు అన్నీ తిరిగి ఇచ్చేశారట.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'ఆచార్య' (Acharya) ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్లు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయి. ఓ ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయితే చిరంజీవికి ఓపెన్ లెటర్ కూడా రాశారు. తనను ఆదుకోమని అందులో పేర్కొన్నారు. సహాయం చేయమని కోరారు. సినిమా రిజల్ట్ గురించి తెలుసుకున్న మెగాస్టార్, డిస్ట్రిబ్యూటర్లకు సహాయం చేసే దిశగా అడుగులు వేశారు.

ఫిల్మ్ నగర్ నుంచి అందిన విశ్వసనీయ వర్గాల ప్రకారం... 'ఆచార్య'కు చిరంజీవి, రామ్ చరణ్ రెమ్యూనరేషన్స్ తీసుకోలేదు. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి - కొరటాల శివతో కలిసి లాభాల్లో వాటా తీసుకునేందుకు అంగీకరించారు. సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మిన తర్వాత... అందులోంచి మేకింగ్ (ప్రొడక్షన్) కాస్ట్ తీసేయగా వచ్చిన మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. ఒక షేర్ నిర్మాతలకు, మరో షేర్ దర్శకుడికి, రెండు షేర్స్  చిరు - చరణ్ తీసుకున్నారట.

'ఆచార్య' ఆశించిన రీతిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం కోసం తాము తీసుకున్న డబ్బులను చిరంజీవి, రామ్ చరణ్ తిరిగి ఇచ్చారని తెలిసింది. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఇటీవల ఫారిన్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన చిరంజీవి... 'ఆచార్య' నిర్మాతలను పిలిచి డబ్బులు ఇచ్చారని తెలిసింది. దాంతో ఇప్పుడు 'ఆచార్య' డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాస్‌లో కొంత భర్తీ కానుంది.

'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి నటించిన సినిమా... 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్ర చేసిన సినిమా... 'ఆచార్య' ఫలితం ఈ విధంగా అవుతుందని ఎవరూ ఊహించలేదు.

Also Read: మొన్న కత్రినా, ఇప్పుడు షారుఖ్ ఖాన్ - కోవిడ్ బారినపడ్డ బాలీవుడ్ స్టార్స్

'గాడ్ ఫాదర్' (God Father Telugu Movie), 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' - ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న రామ్ చరణ్... ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి అంగీకరించారు. ఆ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 

Also Read: ఇక్కడ అంత సీన్ లేదండీ - సాయి పల్లవి అంత మాట అనేశారేంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget