Sai Pallavi: ఇక్కడ అంత సీన్ లేదండీ - సాయి పల్లవి అంత మాట అనేశారేంటి?
సాయి పల్లవి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. మనసు లోపల ఏదీ దాచుకోరు. లేటెస్టుగా ఆమె చేసిన ట్వీట్ నిజాయతీగా మనసులో నుంచి వచ్చిన ఫీలింగ్ అనుకోవాలి ఏమో!
సాయి పల్లవికి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అయితే ఆమెను 'లేడీ పవర్ స్టార్'గా అభివర్ణించారు. సాయి పల్లవి కోసం కొంత మంది సినిమాలకు వెళతారంటే అతిశయోక్తి కాదు. బహుశా... తెలుగునాట ఆమె అభిమాన గణం ఏ స్థాయిలో ఉందనేది మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి, ఆయన ఫ్యామిలీకి చెందిన సురేష్ ప్రొడక్షన్స్ చెవిన పడినట్టు ఉంది. 'విరాట పర్వం' కోసం కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టారు.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'విరాట పర్వం'. ఇందులో హీరోది నక్సలైట్ రోల్. అతడిని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. 'కోలు కోలోయమ్మ...', 'నగదారిలో...' - ఇప్పటి వరకూ విడుదల చేసిన రెండు పాటల్లో సాయి పల్లవి హైలైట్ అయ్యింది. సినిమాలోనూ ఆమె రోల్ హైలైట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
జూన్ 5న (ఆదివారం) కర్నూలులో 'విరాట పర్వం' ట్రైలర్ విడుదల కానుంది. ఈ విషయం వెల్లడించడం కోసం ఒక వీడియో విడుదల చేశారు. అందులో సాయి పల్లవి అభిమానిగా ఒకరు రానా దగ్గరకు వెళ్లడం, ఆమె ఎక్కడని ప్రశ్నించడం... అందుకు బదులుగా రానా 'నేను సాయి పల్లవి ఫ్యానే. సాయి పల్లవి కోసం సినిమా తీసాంరా బాబు' అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. అయితే, ఆ వీడియో చూసిన సాయి పల్లవి స్పందించారు.
''ఇక్కడ అంత సీన్ లేదండీ. నేను చాలా లక్కీ. ప్రేక్షకులు నాపట్ల ఎంతో ప్రేమ, ఆదరణ చూపిస్తున్నారు. వాళ్ళందర్నీ కర్నూలులో కలుసుకోవడం కోసం ఎగ్జయిటెడ్ గా ఉన్నాను'' అని సాయి పల్లవి ట్వీట్ చేశారు. అదీ సంగతి!
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Ikkada anthe scene ledhandi 🙊
— Sai Pallavi (@Sai_Pallavi92) June 4, 2022
Nene chaala lucky, ppl have been extremely kind and sweet.
I’m the one who’s excited to see them all at Kurnool❤️ https://t.co/MGdixjovwm
వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.