News
News
వీడియోలు ఆటలు
X

2024 సంక్రాంతి బరిలో మరో పెద్ద సినిమా - 6 చిత్రాల మధ్య పోటాపోటీ!

టాలీవుడ్ లో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే ఐదు బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే తాజాగా తాజాగా ఈ లిస్ట్ లో మరో పెద్ద సినిమా కూడా చేరినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

తెలుగు సినిమాలకు సంక్రాంతి పండుగ సీజన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండగ వచ్చిందంటే కచ్చితంగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్లోకి రిలీజ్ అవ్వాల్సిందే. చాలా సంవత్సరాలుగా మన టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇక 2024 సంక్రాంతి సీజన్ లో కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఐదు బడా సినిమాలను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కి డేట్ కన్ఫర్మ్ చేసుకోగా.. ఇప్పుడు ఆ లిస్టులో మరో సినిమా కూడా చేరిందని అంటున్నారు. ఇప్పటివరకు వచ్చే ఏడాదికి సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న  'SSMB 28', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ ల 'ఉస్తాద్ భగత్ సింగ్',  శంకర్ - కమల్ హాసన్ ల 'ఇండియన్ 2' రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూడా తన తదుపరిచిత్రాన్ని వచ్చే ఏడాది  సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. గతంలో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' దాని సీక్వెల్  'బంగార్రాజు' సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ ను తన నెక్స్ట్ మూవీకి రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ వరుస అపజయాలతో సతమతమవుతోంది. ఇటీవల అఖిల్ నటించిన 'ఏజెంట్',  చైతు నటించిన 'కస్టడీ' నిరాశపరిచాయి. దీంతో నాగార్జున తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. దానికి తోడు నాగార్జున చేస్తున్న తన తదుపరిచిత్రం ఆయన కెరీర్లో 99వ సినిమా కావడం విశేషం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి తన నెక్స్ట్ మూవీ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ లిస్టులో మరో పెద్ద సినిమా కూడా చేరినట్లు సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో కాంబో సినిమాని కూడా 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లు లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గీతాగోవిందం' ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇక తాజాగా కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పరుశురాం మూవీ షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాల్లో కొన్ని అధికారికంగా సంక్రాంతి రిలీజ్ ని కన్ఫర్మ్ చేసుకోగా.. మరికొన్ని సినిమాలు అఫీషియల్ గా రిలీజ్ డేట్స్ ని ప్రకటించాల్సి ఉంది. మరి ఈ సినిమాలతో పాటు ముందు ముందు ఇంకెన్ని సినిమాలు 2024 సంక్రాంతికి పోటీ పడతాయో చూడాలి..

Also Read: Sharwanand Wedding: శర్వానంద్, రక్షిత రెడ్డి పెళ్లి క్యాన్సిల్? ఇదిగో అసలు క్లారిటీ!

Published at : 17 May 2023 11:33 AM (IST) Tags: 2024 Sankranthi Tollywood New Releases 2024 Sankarnthi 2024 Movies 2024 Sankranthi Box Office Fight

సంబంధిత కథనాలు

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు