By: ABP Desam | Updated at : 16 May 2023 09:55 PM (IST)
Sharwanand/Instagram
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్స్ లో ఒకరైన శర్వానంద్ ఇటీవల రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న శర్వానంద్ ఎటువంటి హడావిడి లేకుండా తన ఎంగేజ్మెంట్ నుంచి చాలా సింపుల్ గా చేసుకుని ఫాన్స్ సైతం ఆశ్చర్యపరిచాడు. జనవరిలో శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకోగా.. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కొంతమంది, సినీ సెలెబ్రెటీలు హాజరయ్యారు. సెలబ్రిటీల్లో రామ్ చరణ్, అతిధిరావు హైదరి, అక్కినేని అఖిల్ తదితరులు హాజరయ్యారు.
అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి సుమారు ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా ఈ జంట పెళ్లి పీటలు ఇక ఎక్కకపోవడంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలు విన్న అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా శర్వానంద్ టీం ఈ వార్తలపై స్వయంగా స్పందించారు. "శర్వానంద్, రక్షిత రెడ్డి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 40 రోజుల పాటూ లండన్ లో షూటింగ్ ని పూర్తి చేసుకొని కొద్ది రోజుల క్రితమే ఇండియాకి తిరిగొచ్చాడు. పెళ్లికి ముందు తన వర్క్ కమిట్మెంట్ ని పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ తర్వాతే పెళ్లి పై ఫుల్ ఫోకస్ పెడతానని చెప్పారు. ప్రస్తుతం శర్వానంద్, రక్షిత ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇద్దరి ఫ్యామిలీస్ హైదరాబాద్ లోనే ఉన్నారు. వారి రెండు కుటుంబాల పెద్దలు త్వరలో సమావేశమై పెళ్లి తేదీని త్వరలోనే ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటిస్తారు" అని శర్వానంద్ టీమ్ తెలిపింది.
శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమాని విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలను ఎదుర్కొంటున్నాడు. 'పడి పడి లేచే మనసు', 'శ్రీకారం', 'జాను', 'మహాసముద్రం', 'ఆడాళ్లు మీకు జోహార్లు' వంటి వరుస ప్లాపుల తర్వాత 'ఒకే ఒక జీవితం' సినిమాతో ఓ మోస్తారు హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఈసారి ఎలాగైనా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా శర్వానంద్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Also Read: ఉబర్ కూల్ లుక్ లో మహేష్ బాబు - వైరల్ అవుతున్న సెల్ఫీ పిక్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?
Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !
Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు
జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు
Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?