Anjana Devi: అమ్మ ఆరోగ్యం బావుంది... అంజనా దేవి హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు
Anjana Devi Health Condition: అంజనాదేవి ఆరోగ్యం గురించి మెగా బ్రదర్ నాగబాబు అప్డేట్ ఇచ్చారు. అమ్మ ఆరోగ్యం బాగుందంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

మెగా మదర్ అంజనా దేవి (Anjana Devi) అనారోగ్యానికి గురి అయ్యారని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. ఆవిడ హెల్త్ కండిషన్ క్రిటికల్ అంటూ సోషల్ మీడియాలో చాలా ఊహగానాలు సర్క్యులేట్ అయ్యాయి. వీటన్నిటికీ మెగా బ్రదర్ నాగబాబు చెక్ పెట్టారు. అంజనా దేవి హెల్త్ అప్డేట్ ఇచ్చారు.
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది!
''అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే... అమ్మ చక్కగా ఉంది'' అని మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దాంతో ఊహాగానాలకు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025
There is some inaccurate information being circulated,but she is absolutely fine.
అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారేంటి?
అంజనా దేవి ఆరోగ్యం గురించి అనూహ్యంగా వార్తల్లోకి రావడానికి కారణం... ఆమె మూడో కుమారుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్ మీటింగ్ మొదలు అయ్యింది. తొలుత ఆ సమావేశానికి హాజరైన పవన్... మీటింగ్ పూర్తిగా మొదలు కాకముందే బయటకు వచ్చేశారు.
Also Read: 'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?
తన తల్లికి బాలేదని, అందువల్ల మీటింగ్ నుంచి వెళుతున్నట్లు ఆయన తెలిపినట్లు ఏపీ క్యాబినెట్ నుంచి లీకులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి చిరంజీవి ఇంటికి వెళ్లారు. దాంతో అంజనా దేవి ఆరోగ్యంపై మెగా అభిమానులలో మరింత ఆందోళన మొదలైంది. మెగా ఫ్యామిలీ వరకు ఈ విషయం వెళ్లడంతో నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
Also Read: ఫ్రీడమ్ ఫైటర్‌గా ఎన్టీఆర్... 'డ్రాగన్'తో రూట్ మార్చిన ప్రశాంత్ నీల్?





















