Anjali: ముందు సీత, ఆ తర్వాతే నేను - తమిళంలో కూడా ఆ మూవీ పాపులర్ - అంజలి
Anjali About Seetha Character: అంజలి కెరీర్‌లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో చేసిన సీత పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. తాజాగా ఈ పాత్రపై, సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ తెలుగమ్మాయి.
Anjali About Seetha Character From Seethamma Vakitlo Sirimalle Chettu: అసలు తెలుగమ్మాయిలకు తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావు అనుకుంటున్న సమయంలోనే తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది అంజలి. కానీ తమిళంతో పోలిస్తే తను నటించిన తెలుగు చిత్రాల సంఖ్య తక్కువే. అయినా కూడా అందులోని ప్రతీ పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆ క్యారెక్టర్స్‌ను ఇప్పటికీ అందరూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు ఇండస్ట్రీల్లో బిజీ అయిన అంజలి.. తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సీత పాత్ర గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
అదే నా లాంచ్..
తను తెలుగులో చేసిన ఏ పాత్రను కోలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు అని అడగగా.. కొంచెం కూడా ఆలోచించకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని సీత పాత్ర అని చెప్పేసింది అంజలి. ఆ క్యారెక్టర్, ఆ సినిమా.. తమిళంలో కూడా చాలా ఫేమస్ అని తెలిపింది. అంతే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు సంబంధించిన మరికొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘అంత పెద్ద సినిమాలో నాకు అవకాశం రావడం చాలా సంతోషం. అది నా లాంచ్ లాంటిదే. జర్నీ తర్వాత నేరుగా నా మొదటి తెలుగు మూవీ అది. ఎటు తిరిగి చూసినా అందులో పెద్ద యాక్టర్లే’’ అంటూ చెప్పుకొచ్చింది అంజలి.
అస్సలు నిలబడదు..
‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ సమయంలో సీరియస్‌గా ఉండకుండా.. నేనే సీత అయితే ఎలా ఉంటుందో అలా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్లిపోయాను. ఒత్తిడి తీసుకోకుండా చేశాను. శ్రీకాంత్ అడ్డాల నాకు ఆ పాత్ర గురించి చెప్పినప్పుడే అసలు సీత ఎక్కడా నిలబడదు, పరిగెడుతూనే ఉంటుంది అని చెప్పారు. మ్యాజిక్ అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. సీత అనే క్యారెక్టర్ డిజైన్ చేయడమే ఒక మ్యాజిక్. పేపర్ మీద ఆ క్యారెక్టర్‌ను ఎలా రాశారో అంతకంటే బాగా సినిమా రావడం అనేది మరింత స్పెషల్‌గా మారిపోయింది. అది ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది’’ అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని సీత క్యారెక్టర్ తనకు ఎంత స్పెషల్ అని చెప్పింది.
అదృష్టంగా భావిస్తున్నాను..
సినిమా పూర్తయిపోయిన తర్వాత ఏదైనా క్యారెక్టర్ తనకు బలంగా గుర్తుండిపోయిందా అని అడగగా.. ముందుగా సీత అనే చెప్పింది అంజలి. ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చిన తర్వాత చాలామందికి నేను సీతగానే తెలుసు. ఆ తర్వాతే అంజలిగా తెలుసు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’కి ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే డైలాగ్ చెప్పమని అడుగుతున్నారు. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆ మ్యాజిక్ నాతో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇక తను హీరోయిన్‌గా నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే హారర్ కామెడీ మూవీ.. ఇటీవల థియేటర్లలో విడుదలయ్యి పాజిటివ్ రివ్యూలను అందుకుంటోంది.
Also Read: సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా?- విశాల్ వీడియోపై నటి కస్తూరి తీవ్ర విమర్శలు