అన్వేషించండి

Animal: మిడ్ నైట్ to ఎర్లీ మార్నింగ్ - ఇకపై ‘యానిమల్’ 24 గంటల షోస్

‘యానిమల్’ బాగుందని బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిన తర్వాత టికెట్ల కోసం ప్రేక్షకులు కష్టపడుతున్నారు. ప్రస్తుతం దాదాపుగా హౌజ్‌ఫుల్ షోలతో నడుస్తోంది ఈ సినిమా.

Animal Movie Shows: ప్రతీ భాషలోని ప్రేక్షకులు ఒక సినిమా గురించి ఇంతలాగా మాట్లాడుకొని చాలాకాలమే అయ్యింది. అంతలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ‘యానిమల్’ చిత్రం. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే సినిమా విడుదలై అయిదు రోజులు అవుతున్నా ఇంకా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ స్క్రీనింగ్ గురించి థియేటర్ల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చూసి ‘యానిమల్’ మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

24x7 స్క్రీనింగ్స్..
డిసెంబర్ 1న ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యింది. ఏ సినిమా లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ‘యానిమల్’ విడుదల అవ్వడంతో థియేటర్లలో షోలకు మామూలుకంటే కాస్త ఎక్కువ సమయమే పడుతోంది. అందుకే 24x7 స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయాలని ప్రేక్షకులు కోరారు. ఈ ఐడియా బాగుందని థియేటర్ల యాజమాన్యాలు కూడా దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇక తాజాగా ‘యానిమల్’కు అర్థరాత్రి 2 గంటల వరకు తిరిగి ఉదయం 5.30 నుంచి షోలు వేసే అనుమతి దొరికింది. ఇక షోలు పెరగడం అనేది ‘యానిమల్’ చూడాలనుకొని టికెట్లు దొరకక చూడలేకపోయిన వారికి గుడ్ న్యూస్‌గా మారింది. ఇప్పటికీ హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతున్న ఈ మూవీ కలెక్షన్స్‌ను మరింత పెంచడానికి ఈ 24x7 స్క్రీనింగ్స్ ఉపయోగపడతాయి. అయితే, ఏయే రాష్ట్రాల్లో దీనికి అనుమతి లభించిందనేది తెలియాల్సి ఉంది.

రష్మికను మించిపోయిన తృప్తి..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో హీరోయిన్‌గా రష్మిక నటించింది. కానీ మూవీ విడుదలయిన తర్వాత ఇందులో కీలక పాత్ర చేసిన తృప్తి దిమ్రీ యాక్టింగ్‌కు విశేష స్పందన లభిస్తోంది. తన పాత్ర ఉన్నది కాసేపే అయినా తన బోల్డ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతే కాకుండా రష్మికకంటే తృప్తి నే బాగుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రణబీర్‌తో రష్మిక కంటే తృప్తి కెమిస్ట్రీనే బాగుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే తెలుగు నుంచి కూడా నిర్మాతలు తనకు ఆఫర్లు ఇవ్వడానికి క్యూ కట్టారట. ఇలా ప్రతీ అంశంతో ఆడియన్స్.. తన సినిమాకు ఫిదా అయ్యేలా చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

బాక్సాఫీస్ లెక్కలు..
బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ‘యానిమల్’.. ఉన్న రికార్డులను బద్దలుకొడుతూ.. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళ్తోంది. రెండో రోజు బుకింగ్స్ విషయంలో ‘జవాన్’, ‘లియో’ వంటి చిత్రాలను మించిపోయిందట ‘యానిమల్’. సెకండ్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ.29 కోట్లు మార్క్‌ను టచ్ చేసిందట. దీంతో రెండో రోజు కలెక్షన్స్ విషయంలో ‘జవాన్’ చిత్రానికి రికార్డును బద్దలగొట్టింది ‘యానిమల్’. ఇక ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ‘యానిమల్’ తన సత్తా చాటుకుంటోంది. కేవలం నార్త్ అమెరికాలోనే 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందట ఈ సినిమా. మొదటి రోజే ఎక్కువ కలెక్షన్ సాధించిన హిందీ సినిమాగా ‘యానిమల్’.. అక్కడ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget