అన్వేషించండి

Animal Deleted Scene: ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!

‘యానిమల్’ సినిమాకు సంబంధించిన ఎక్కువ సీన్స్‌ను కట్ చేయలేదు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కానీ ఆయన డిలీట్ చేసిన సీన్స్‌లో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈరోజుల్లో విడుదలవుతున్న చాలావరకు సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారేమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. అలాంటిది ప్రేక్షకులు.. కచ్చితంగా ‘యానిమల్’ను ఇష్టపడతారు అనే నమ్మకంతో దాదాపు మూడున్నర గంటల సినిమాను వారి ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తను ఇష్టపడి, కష్టపడి తెరకెక్కించిన చిత్రాన్ని ఎవరూ కట్ చేయకూడదు అనే ఉద్దేశ్యంతో తానే ఎడిటర్‌గా కూడా వ్యవహరించాడు. అందుకే 3 గంటల 49 నిమిషాల నిడివి వచ్చిన సినిమాను ఎక్కువగా కట్ చేయకుండా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో విడుదల చేశాడు. అయితే ఆ కట్ చేసిన సీన్స్‌లో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

డిలీటెడ్ సీన్ లీక్..
ఇప్పటికే సెన్సార్ బోర్డ్.. ‘యానిమల్’లోని ఒక న్యూడ్ సీన్‌ను డిలీట్ చేసింది. దాంతో పాటు మరో డిలీటెడ్ సీన్ కూడా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్‌లో రణబీర్ కపూర్ పూర్తిగా గాయాలతో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా తన నడక కూడా సరిగా లేదు. ఒక ప్రైవేట్ జెట్‌లో నడుచుకుంటూ.. ఒక డ్రింక్ తీసుకొని.. పైలెట్ దగ్గరకు వెళ్లి.. తనను తప్పుకోమని చెప్పి రణబీర్ విమానాన్ని నడుపుతాడు. ఆ ప్రైవేట్ జెట్‌లో ఉన్న మిగతా ప్రయాణికులు.. రణబీర్‌ను ఆశ్చర్యంగా చూస్తుంటారు. అయితే హీరో ఈ సీన్‌లో సిగరెట్ తాగుతూ విమానాన్ని నడిపించడం కరెక్ట్ కాదని సెన్సార్.. ఈ సీన్‌ను తొలగించి ఉండవచ్చని లేదా సందీపే ఈ ఒక్క సీన్.. తన సినిమాలో అనవసరం అనుకొని కట్ చేసి ఉండవచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 

3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో..
‘యానిమల్’ నుండి విడుదలయిన ఒక పాటలో ఈ డిలీటెడ్ సీన్‌కు సంబంధించిన గ్లింప్స్ ఉంది. కానీ సినిమాలో మాత్రం ఈ సీన్ ఎక్కడా లేదేంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోయారు. మామూలుగా సందీప్.. తను తెరకెక్కించిన ఏ సీన్ కూడా ప్రేక్షకులకు చూపించకుండా ఉండడు. అందుకే ‘యానిమల్’లో ఇంకేమైనా డిలీటెడ్ సీన్స్ ఉన్నా.. అవి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని వారు భావిస్తున్నారు. ఇక 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వండర్స్ సృష్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా హీరోగా నటిస్తున్నా.. తన పర్ఫార్మెన్స్‌తో ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నా కూడా ‘యానిమల్’ అనేది రణబీర్ కెరీర్‌ను మలుపుతిప్పే చిత్రమని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణబీర్ కపూర్‌కు జోడీగా రష్మిక నటించింది. ఇందులో హీరోకు ఉన్నంత ప్రాముఖ్యత హీరోయిన్‌కు లేకపోయినా.. తను పలు సీన్స్‌లో బాగా నటించిందని ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’ రికార్డులను బద్దలుకొట్టింది ‘యానిమల్’. అంతే కాకుండా కేవలం రెండురోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రంగా రికార్డును సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసింది ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలయిన ఈ చిత్రం.. మరికొన్ని రోజులు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లలో రన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget