అన్వేషించండి

Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

తాజాగా విడుదలయిన రణబీర్ కపూర్ చిత్రం ‘యానిమల్’.. ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్ త్రిషను కూడా ఇంప్రెస్ చేయడంతో ఆ మూవీకి త్రిష రివ్యూ కూడా ఇచ్చింది.

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సృష్టిస్తోంది. సందీప్‌కు బాలీవుడ్‌లో ఇది రెండో సినిమానే అయినా.. ఇందులో వయొలెన్స్, యాక్షన్ చూసి ఇప్పటివరకు ఏ దర్శకుడు ఇలాంటి యాక్షన్‌ను తెరకెక్కించలేదని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష సైతం మూవీ చూసి ఫిదా అయ్యింది. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘యానిమల్’ చిత్రానికి తన రివ్యూను అందించింది. కానీ దీని కారణంగా చాలా నెగిటివిటీని కూడా ఎదుర్కుంది. దీంతో కాసేపట్లోనే ఆ రివ్యూ పోస్టును డిలీట్ చేసింది.

కల్ట్ యానిమల్..
సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్‌తో జరిగిన వివాదం వల్ల త్రిష పేరు గతకొంతకాలంగా న్యూస్‌లో వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యానిమల్’ చిత్రాన్ని పొగుడుతూ.. ఈ భామ స్టోరీలు పెట్టింది. ఈ స్టోరీల్లో రణబీర్ కపూర్ ‘యానిమల్’ పోస్టర్‌ను పెట్టి.. ‘ఒక్కే మాట - కల్ట్. పాప్పా’ అంటూ పలు ఎమోజీలను కూడా యాడ్ చేసింది త్రిష. దీంతో త్రిషకు ఈ సినిమా ఎంత నచ్చిందో అర్థమవుతోంది. తను ఈ మూవీకి పాజిటివ్ రివ్యూనే ఇచ్చినా కూడా నెటిజన్లకు మాత్రం ఎందుకో ఈ విషయం నచ్చలేదు. దీంతో ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ‘యానిమల్’ రివ్యూను డిలీట్ చేసింది త్రిష.

ఎలా సపోర్ట్ చేస్తున్నారు..?
‘యానిమల్’కు త్రిష ఇచ్చిన రివ్యూ డిలీట్ అవ్వకముందే దానిని చూసిన పలువురు నెటిజన్లు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవడంతో.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్ పాత్ర చాలా టాక్సిక్‌గా ఉంటుంది. అయితే అలాంటి పాత్రలను సపోర్ట్ చేసి మాట్లాడినందుకు త్రిషకు ఘోరంగా నెగిటివిటీ ఎదురవుతోంది. మన్సూర్ అలీ ఖాన్.. తనపై రేప్ కామెంట్స్ చేశాడని, తనతో బెడ్ రూమ్ సీన్ లేదని ఫీల్ అయ్యానని వ్యాఖ్యలు చేశాడని సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేగింది. అలాంటిది మహిళలను అసలు సరిగా ట్రీట్ చేయని ‘యానిమల్’లాంటి చిత్రానికి త్రిష ఎలా సపోర్ట్ చేస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరోసారి సోషల్ మీడియాలో చర్చ..
‘యానిమల్’ చిత్రాన్ని ‘కల్ట్’ అని పిలవడంపై కూడా త్రిషపై నెగిటివిటీ ఏర్పడుతోంది. మీరే కదా మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌కు రచ్చ చేసింది అంటూ ఒక నెటిజన్.. ఆ స్టోరీని షేర్ చేసిన కామెంట్ చేశారు. హీరోయిన్సే ఇలాంటి సినిమాను సపోర్ట్ చేయడమేంటి అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రితం త్రిష హీరోయిన్‌గా నటించిన ‘లియో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత.. అందులో ఒక పాత్రలో కనిపించిన మన్సూర్ అలీ ఖాన్.. నటిపై రేప్ కామెంట్స్‌ను చేశాడు. మన్సూర్ అలా చేయడం కరెక్ట్ కాదని కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కూడా త్రిషకు అండగా నిలబడి, ఆయన వ్యాఖ్యలను ఖండించింది. సమస్య పెద్దగా అవుతుండడంతో మన్సూరే స్వయంగా త్రిషకు సారీ చెప్పాడు. త్రిష కూడా ఆ సారీని వెంటనే యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ‘యానిమల్’ మూవీ గురించి స్పందించడంతో మరోసారి తన పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget