Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం
Kannada celebrities face humilation at Santhosham South Indian Film awards at Goa: గోవాలో డిసెంబర్ 2న నిర్వహించిన 'సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ మీద కన్నడ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'సంతోషం' మ్యాగజైన్ అధినేత, నిర్మాత, నటుడు అయినటువంటి సురేష్ కొండేటి (Suresh Kondeti) గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఓ జర్నలిస్టుగా సినిమా యూనిట్స్ నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాల్లో ఆయన అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో! ఆయన తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. ఆయన వేసిన ప్రశ్నలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా కన్నడ సినిమా తారలు అందరూ ఏకమై సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్.
గోవాకు పిలిచి అవమానిస్తారా? ఇదెక్కడి పద్ధతి!
Santosham South Indian Film Awards 2023 Goa: ప్రతి ఏడాది సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలను సురేష్ కొండేటి నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది గోవాలో డిసెంబర్ 2న నిర్వహించారు. అయితే... ఆ అవార్డు వేడుకలో కన్నడ సినిమా ప్రముఖులకు అవమానం జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంతోషం అవార్డుల వేడుక ప్రారంభమైన విధానం బావుందని, కానీ ముగించిన తీరు అసలు బాలేదని శారదా శ్రీనిధి పేర్కొన్నారు. 'క్రాంతి' (కన్నడ స్టార్ దర్శన్ నటించిన సినిమా), 'వేద' (శివ రాజ్ కుమార్ సినిమా) బృందాలకు ఒక్కో అవార్డు అందుకున్నారని, ఆ తర్వాత రమేష్ అరవింద్ స్టేజి మీదకు వెళ్ళగానే లైట్స్ ఆపేశారని, కన్నడ తారలు అందరినీ వెళ్లిపొమ్మని చెప్పారని ఆమె వివరించారు.
.#Kannada celebrities face humilation at #SanthoshamSouthIndian Film awards #Goa
It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham #South #Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1— A Sharadhaa (@sharadasrinidhi) December 3, 2023
హోటల్ బిల్స్ కూడా కట్టలేదు...
చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో!
రమేష్ అరవింద్ ఒక్కరే కాదని... సంతోషం అవార్డులకు హాజరైన హీరోయిన్ రాగిణీ ద్వివేది, 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ సహా పలువురు సెలబ్రిటీలు సురేష్ కొండేటి వ్యవహార శైలితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని శారదా శ్రీనిధి తెలిపారు. హోటల్ బిల్స్ పే చేయకపోవడంతో రూమ్స్ లాక్ చేశారని, చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో సెలబ్రిటీలంతా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారని చెప్పారు. హోటల్ ప్రతినిధులు, సెలబ్రిటీల స్టాఫ్ మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది.
సంతోషం అవార్డుల వేడుకకు పిలిచి మరీ గోవాలో తమ అభిమాన నటీనటులను ఈ విధంగా అవమానించడం ఏమిటని కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమా ఎదుగుదలను ఓర్వలేక ఈ విధంగా చేశారని కామెంట్స్ చేస్తున్న నెటిజనులు కూడా ఉన్నారు. అయితే... ఓ వ్యక్తి, ఓ సంస్థ చేసిన పనికి తెలుగు చిత్రసీమను నిందించడం తగదని, వాళ్ళకు తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అతి త్వరలో దీనిపై పెద్దలు ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.
Also Read: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్... కేసీఆర్ పార్టీ ఓడిపోగానే ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Also Read: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే