Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Surekha Vani Daughter Viral Post: సురేఖా వాణి కుమార్తె సుప్రీత వ్యవహార శైలి చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓడిన తర్వాత ఆమె ప్లేట్ తిప్పేశారని కామెంట్ చేస్తున్నారు.
Surekha Vani Daughter Instagram Story goes viral: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)ది కీలక పాత్ర. ఆయనకు పలువురు అభినందనలు చెబుతున్నారు. అందులో తప్పు లేదు. అయితే... ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తె బండారు సుప్రీతా నాయుడు పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం చర్చనీయాంశం అవుతోంది.
రేవంత్ రెడ్డికి సుప్రీత కంగ్రాట్స్!
Telangana New CM Revanth Reddy: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంగ్రాట్స్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందిన నేపథ్యంలో తెలంగాణలో విజయం రేవంత్ రెడ్డి విజయం అన్నారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు. సుప్రీత సైతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకు? అంటే...
ఎన్నికలకు ముందు కొంత మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వీడియోలు పోస్ట్ చేశారు. కెసిఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని, 'అంతకు ముందు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది' అంటూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్ వీడియోలు పోస్ట్ చేశారు. అదంతా ప్రచారంలో భాగం! ఆ ప్రచారం చేసిన ఇన్‌ఫ్లూయెన్సెర్లలో సుప్రీతా నాయుడు బండారు ఒకరు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో సురేఖా వాణి పేరు వినిపించింది. దాంతో తమకు సంబంధం లేదని ఆమె వివరించారు.
Also Read: హనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్... వరుణ్ తేజ్, లావణ్య ఎక్కడికి వెళ్లారో తెలుసా?
Supriya deleted the campaign reel of TRS and updated her insta story with this photo. 😹😹 pic.twitter.com/PnG8wLjUr9
— Satya (@YoursSatya) December 3, 2023
బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సుప్రీతా నాయుడు, అషు రెడ్డి, హిమజ వంటి తారలు ప్రచారం చేయడంతో డ్రగ్స్ కేసు దొంగలు అందరూ గులాబీ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కేసుల నుంచి వాళ్ళకు విముక్తి కల్పించినందుకు ప్రతిఫలమే ఈ ప్రచారమని కొందరు కామెంట్ చేశారు. అయితే... కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ సాధించలేదు.
Also Read: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ఓటమి చెందిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తన సోషల్ మీడియా అకౌంటులో పోస్ట్ చేసిన వీడియోను సుప్రీత డిలీట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు. దాంతో ఆవిడ ప్లేట్ తిప్పేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బహుశా... ఈ కామెంట్స్ సుప్రీత దృష్టికి వచ్చాయేమో!? 'మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్' అని ఎవరో చేసిన పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు సుప్రీత. దాంతో ఆమె వ్యవహార శైలిపై నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. సుప్రీతా నాయుడు మాత్రమే కాదు... బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసిన కొందరు ఆ వీడియోలను డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.