అన్వేషించండి

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash Next Movie: 'రాకీ భాయ్' యశ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఇన్ డైరెక్టుగా గుడ్ న్యూస్ వచ్చింది.

Yash Next Movie Announcement Loading: ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు? రాకీ భాయ్ యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు? అని కర్ణాటకలో అతని అభిమానులు మాత్రమే కాదు... 'కెజియఫ్' చూసి అతని నటనకు అభిమానులుగా మారిన ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు యశ్. అది కూడా నేరుగా కాదు లెండి... ఇన్ డైరెక్టుగా!

యష్ 19... లోడింగ్!
KGF Star Yash Upcoming movie: 'కెజియఫ్ 2' గత ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే... ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర దాటింది. కానీ, ఇప్పటి వరకు యశ్ నుంచి కొత్త సినిమా కబురు రాలేదు. హిందీలో రామాయణం ఆధారంగా తీయనున్న పాన్ ఇండియా సినిమాలో రావణుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు తెలిసింది. అందుకోసం భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారట. అయితే... అధికారంగా ఆ సినిమా వివరాల్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. 

మలయాళీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్, యశ్ కలయికలో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా హీరో, దర్శకురాలి మధ్య కథపై చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమాను కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. లేటెస్టుగా సోషల్ మీడియాలో తన డీపీని యశ్ ఛేంజ్ చేశారు. 'లోడింగ్' అని ఇంగ్లీష్ లెటర్స్ పోస్ట్ చేశారు. త్వరలో కొత్త సినిమా కబురు చెప్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన ఆ హింట్ ఇచ్చారు. గీతూ మోహన్ దాస్ సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు శాండిల్ వుడ్ టాక్. ఏ సినిమా అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. 

Also Read: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్... కేసీఆర్ పార్టీ ఓడిపోగానే ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

రాకీ భాయ్ రిటర్న్స్... 'కెజియఫ్ 3' ఎప్పుడు?
Is KGF Part 3 coming?: యశ్ కొత్త సినిమా కోసం ఆయన అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో... అదే విధంగా 'కెజియఫ్ 3' కోసం రాకీ భాయ్ (సినిమాలో హీరో) ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. 

'కెజియఫ్ 2' పతాక సన్నివేశాల్లో అప్పటి వరకు తాను కూడబెట్టిన బంగారంతో ఓడలో వెళుతున్న రాకీ భాయ్ సముద్రంలో మునిగినట్లు చూపించారు. అయితే... అక్కడితో అతని ప్రయాణం ముగిసిపోలేదు. 'కెజియఫ్ 3' కూడా ఉన్నట్లు చివర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించారు. ప్రస్తుతం 'సలార్'తో బిజీగా ఉన్న ఆయన 'కెజియఫ్ 3'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే... 'సలార్ 2' తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. ఆ తర్వాత యశ్ హీరోగా సినిమా చేయడానికి వీలు అవుతుంది. 

Also Readహనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్... వరుణ్ తేజ్, లావణ్య ఎక్కడికి వెళ్లారో తెలుసా?

'సలార్'లో రాకీ భాయ్ కనిపిస్తారని కొంత మంది ప్రేక్షకులు ఆశించారు. 'కెజియఫ్' ఫ్రాంచైజీలో 'సలార్' కూడా ఉంటుందని ముందు నుంచి ఊహాగానాలు వినిపించాయి. రెండు ప్రపంచాలు వేర్వేరు అని, రెండిటికి సంబంధం లేదని ప్రశాంత్ నీల్ చెప్పడంతో వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget