Chiranjeevi : ఖైదీ To 'మన శంకర వరప్రసాద్ గారు' వరకూ - మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి... ట్రెండింగ్ AI వీడియో
Mana Shankaravara Prasad Garu : స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా షేర్ చేసిన ఏఐ వీడియో ట్రెండ్ అవుతోంది. తాను చిన్నప్పటి నుంచీ చూసిన మెగాస్టార్ నుంచి ఇప్పటివరకూ ఆయన సెల్ఫీలు దిగారు.

Anil Ravipudi Shares Chiranjeevi AI Video : ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏఐతో డైరెక్టర్ అనిల్ మ్యాజిక్ చేశారు. మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' మూవీ నుంచి లేటెస్ట్ 'మన శంకరవరప్రసాద్ గారు' వరకూ చిరుతో సెల్ఫీ దిగినట్లుగా ఓ వీడియో క్రియేట్ చేశారు.
థాంక్స్ టూ AI
'నేను చిన్నప్పటి నుంచి అలా చూస్తూ పెరిగిన మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచీ ఇలా నేను డైరెక్ట్ చేసిన మెగాస్టార్ వరకూ అందరితోనూ సెల్ఫీలు దిగాను. థాంక్స్ టు AI. టెక్నాలజీని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.' అంటూ ఆ వీడియోను షేర్ చేశారు. చిరంజీవి ఖైదీ నుంచి గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ముఠామేస్త్రీ, అన్నయ్య, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్ వరకూ ఇప్పటి 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ వరకూ చిరుతో సెల్ఫీలు దిగినట్లుగా ఆ వీడియో ఉంది.
Going with the trend 😃👌🏻
— Anil Ravipudi (@AnilRavipudi) December 21, 2025
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు🥳🥳🥳
Thanks to AI 😄
(‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు 😉)#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/o23yvZOlMw
ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో 'AI'ను సూపర్‌గా వాడుకుంటున్నారని... ఒక్కసారిగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్స్ గుర్తు చేశారని అంటున్నారు. అయితే, 2 రోజుల క్రితం హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్ 3' రిలీజ్ సందర్భంగా అవతార్ హీరో జేక్ మన టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో షూటింగ్ సెట్స్‌లో సెల్ఫీలు దిగినట్లుగా ఉన్న వీడియో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు సేమ్ అలాగే మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి వీడియో కూడా ట్రెండ్ అవుతోంది.
Also Read : కళ్లద్దాలు చూపించిన మర్డర్ మిస్టరీ - ట్రెండింగ్‌లో వరుణ్ సందేశ్ థ్రిల్లింగ్ సిరీస్ 'నయనం'





















