Nayanam Web Series OTT : కళ్లద్దాలు చూపించిన మర్డర్ మిస్టరీ - ట్రెండింగ్‌లో వరుణ్ సందేశ్ థ్రిల్లింగ్ సిరీస్ 'నయనం'
Nayanam Series OTT Streaming : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ డెబ్యూ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ 'నయనం' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Varun Sandesh's Nayanam Web Series OTT Streaming : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ రీసెంట్‌గా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'నయనం'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా ఓటీటీ సిరీస్‌తో వరుణ్ సందేశ్ గ్రాండ్‌గా డెబ్యూ చేశాడు. ఆయన ఐ స్పెషలిస్ట్ డాక్టర్‌గా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంది.
టాప్ ట్రెండింగ్‌లో...
ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ 'ZEE5' 'నయనం' సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా... సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. వరుణ్ సందేశ్ థ్రిల్లింగ్ సిరీస్‌తో కమ్ బ్యాక్ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించగా... వరుణ్ సందేశ్‌తో పాటు ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రజా, హరీష్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యాయి. ప్రతీ ఎపిసోడ్‌లో సస్పెన్స్, థ్రిల్, దీనికి తోడు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ట్రెండింగ్ అవుతుండడంతో టీం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read : 'మన శంకరవరప్రసాద్ గారు' రన్ టైం ఫిక్స్? - ఆడియన్స్ ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా!
స్టోరీ ఏంటంటే?
డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) కంటి వైద్యుడు. అతనికి చిన్నప్పటి నుంచీ ఇతరుల విషయాలు తెలుసుకోవడం అంటే మహా ఇంట్రెస్ట్. ఈ క్రమంలో కంటి సాయంతో ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ ఎక్స్‌పెరిమెంట్ చేస్తాడు. తన దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెట్స్‌కు కంటిలో ఓ రకమైన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా 12 గంటల్లోపు 4 నిమిషాల పాటు వారు ఏం చేసినా తన స్పెషల్ కళ్లజోడుతో చూడగలుగుతాడు.
అలా తన దగ్గరకు ట్రీట్మెంట్‌కు వచ్చిన మాధవి (ప్రియాంక జైన్) తన భర్త గౌరీ శంకర్ (ఉత్తేజ్)ను హత్య చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు మాధవి తన భర్తను ఎందుకు హత్య చేసింది? పోలీసులకు నయన్ ఈ విషయం చెప్పాడా? సీఐ (అలీ రాజా) ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? నయన్ మంచికే చేశాడా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.





















