Anchor Syamala: టాలీవుడ్‌లో శ్యామల రీ ఎంట్రీ... వైసీపీ నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిందా?
Anchor Syamala Tollywood Reentry: శ్యామల పేరు కొన్నాళ్ళుగా రాజకీయాల్లో ఎక్కువ వినబడుతోంది. యాంకరింగ్, యాక్టింగ్ వంటివి చేయడం లేదు. కొంత గ్యాప్ తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.

- యాంకర్ శ్యామల 'రమణీ కళ్యాణం' సినిమాలో కనిపించారు.
- ఈ సినిమా మూడేళ్ల క్రితం తీసినా, ఆలస్యంగా విడుదలైంది.
- రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న శ్యామల రీ ఎంట్రీ కాదిది.
- వైసీపీలో ఉన్నా, ప్రస్తుతం ఆమె పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు.
శ్యామల పేరు కొన్ని నెలలుగా రాజకీయాల్లో ఎక్కువ, టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ వినబడుతోంది. ఈ మధ్య కాలంలో నటన వైపు కన్నెత్తి చూడలేదు. యాంకరింగ్, యాక్టింగ్ అనేది చేయలేదు. అటువంటి శ్యామల (Anchor Syamala) ఇవాళ సినిమాలో ప్రత్యక్షం అయ్యారు. దాంతో మళ్ళీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఇంతకీ, శ్యామల ఏ సినిమా చేశారు? ఆమెది రీ ఎంట్రీ అనుకోవాలా? అసలు విషయం ఏమిటి? అనేది చూస్తే...
ఎప్పుడో చేసిన సినిమా... ఇప్పుడు రిలీజ్!
మే 22, 2026న 'రమణీ కళ్యాణం' విడుదలైంది. ఆ సినిమాలో హీరో సూర్య వశిష్ట స్నేహితుడిగా శ్రీనివాసరెడ్డి కనిపించారు. ఆయన భార్య పాత్రలో, ప్రేమ పెళ్లి చేసుకున్న మహిళగా శ్యామల (Anchor Syamala Movies List 2026) కనిపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఈ సినిమా ఇప్పటిది కాదు. మినిమమ్ మూడేళ్ళ క్రితం చేసిన సినిమా అని టాక్. విడుదల ఆలస్యం అయ్యింది. దాంతో శ్యామల తెరపై కనిపించింది. అంతే కానీ... ఆవిడ రీ ఎంట్రీ ఏమీ కాదు. విచిత్రం ఏమిటంటే... ట్రైలర్‌లో కూడా ఆవిడని చూపించలేదు.
View this post on Instagram
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు శ్యామల. ఆ పార్టీలో ఆవిడ 2019లో చేరినా... ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి యాక్టివ్ అయ్యారు. అప్పటి నుంచి ఫిల్మ్ ఈవెంట్లలో తక్కువ... పొలిటికల్ ప్రెస్‌మీట్లలో ఎక్కువ కనిపించారు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్స్ కూడా పెట్టడం లేదు.
Also Read: Ramani Kalyanam Review - 'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?
వైసీపీ శ్యామలను పక్కన పెట్టిందని, అందువల్ల తాడేపల్లి కార్యాలయంలో ఆవిడ ప్రెస్ మీట్లు నిర్వహించడం లేదని రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. అటువంటిది ఏమీ లేదని తాను వైసీపీలో ఉన్నానని శ్యామల సోషల్ మీడియా 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. అంతే కానీ వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టలేదు. అందుకని, 'రమణీ కళ్యాణం'లో కనిపించిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారేమో అని కొందరికి సందేహం కలిగింది. అసలు మ్యాటర్ ఏమిటంటే... ఆ సినిమా శ్యామల గతంలో నటించినది. వైసీపీలోకి వెళ్లి గతంలో రాజకీయ విమర్శలు చేసిన పలువురు ఆర్టిస్టులు మళ్ళీ సినిమాల్లోకి కనిపించడానికి ఎక్కువ సమయం పట్టింది. నటుడు అలీ సైతం తనను ఐదేళ్లు వాడుకుని వదిలేశారన్నట్టు మాట్లాడారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















