అన్వేషించండి

Ramani Kalyanam Review - 'రమణీ కళ్యాణం' రివ్యూ: ఆనందంలో అంతులేని బాధలు... సినిమా హిట్టా? ఫట్టా?

Ramani Kalyanam Telugu Review: సూర్య వశిష్ట, దీప్శిఖా చంద్రన్ జంటగా నటించిన సినిమా 'రమణీ కళ్యాణం'. హీరోకి కాళ్ళు లేవు... హీరోయిన్‌కు కళ్ళు లేవు... వీళ్ళిద్దరి ప్రేమ కథ వర్కవుట్ అవుతుందా? లేదా?

Ramani Kalyanam Review In Telugu: 'బుట్టబొమ్మ', 'దేవికా అండ్ డానీ' వెబ్ సిరీస్ ఫేమ్ సూర్య వశిష్ట హీరోగా నటించిన సినిమా 'రమణీ కళ్యాణం'. ఇందులో దీప్శిఖా చంద్రన్ హీరోయిన్. 'కోర్ట్' ఫేమ్ రామ్ జగదీశ్ డైలాగులు అందించిన ఈ సినిమాలో హీరో కాళ్ళు కడపలేడు... హీరోయిన్‌కు కంటిచూపు లేదు... వీళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.

కథ (Ramani Kalyanam Story Explained): చిన్నతనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని, కంటిచూపును కోల్పోతుంది సంజయ (దీప్శిఖా చంద్రన్). కంటిచూపు లేదని తనపై ఇతరులు సింపతీ చూపించడం ఆమెకు నచ్చదు. బామ్మ, నలుగురు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. డైలీ ఓ పబ్‌లో సాయంత్రం వేళ పాటలు పడుతుంది. అక్కడ ఆమెకు రాజ్ (సూర్య వశిష్ట) పరిచయం అవుతారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ అబ్బాయి నడవలేడు. ఓ ప్రమాదంలో కాళ్ళు ప్యారలైజ్ అవుతాయి. అయితే వీళ్ళ ప్రేమకు అవేవీ అడ్డు కాలేదు.

కంటిచూపు లేని సంజన, కాళ్ళు కదపలేని రాజ్ ప్రేమలో పడితే... పబ్ ఓనర్, రాజ్ స్నేహితుడు కిశోర్ (శ్రీనివాసరెడ్డి) టెన్షన్ పడతాడు. ఎందుకు? వీళ్ళిద్దరి ప్రేమలో ఎదురైన కష్టాలు ఏమిటి? విలన్ ఎవరు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Ramani Kalyanam Review Telugu): రమణీ కళ్యాణం... టైటిల్‌లో చక్కటి తెలుగుదనం ఉట్టిపడుతోంది కదూ! సినిమాలోనూ ఆ తెలుగుదనం ఉంది. సినిమా పాటల్లో శ్రావ్యత, బాణీలు ఉన్నాయి. దీప్శిఖా చంద్రన్ నటనలో కళ ఉంది. కానీ, కథలో అంతులేని వ్యధ, ఎంతో బాధ ఉన్నాయి. అందువల్ల, అడుగడుగునా ఓ వెలితి ప్రేక్షకుడిని వెంటాడుతోంది.

సింపుల్‌గా చెప్పాలంటే... ఎదుటి వ్యక్తిలో లోపాలు లేదా శాపాలు చూసి వాళ్ళ మీద జాలి చూపించకూడదని, అది వాళ్ళకు క్వాలిఫికేషన్ కాకూడదని చెప్పే సినిమా 'రమణీ కళ్యాణం'. హీరోయిన్‌కు కంటి చూపు లేకపోవడం, హీరోకి కాళ్ళు పడిపోవడం ప్రేమ కథలో పైకి కనిపించే అంశాలే. అయితే... అసలు కథలో కోర్ పాయింట్ మాత్రం శేఖర్ కమ్ముల 'ఆనంద్' నుంచి ఎత్తేశారు. కమలినీ ముఖర్జీ పేరెంట్స్ ప్రాణాలు పోవడానికి రాజా కారణం అవుతాడు. సేమ్ టు సేమ్... 'రమణీ కళ్యాణం' సినిమాలోనూ హీరోయిన్ కుటుంబం, కంటి చూపు పోవడానికి హీరో కారణం అవుతాడు. అది తెలిశాక హీరో ఏం చేశాడు? అనేది క్లైమాక్స్. అది చూసినప్పుడు రీసెంట్ సినిమాలు కొన్ని గుర్తుకు వస్తాయి. 'ఆనంద్' పాయింట్ తీసుకుని అంతులేని వ్యధ, బాధలు యాడ్ చేశారు దర్శకుడు ప్రణవ స్వరూప్. అయితే కథకు కీలకమైన ప్రేమలో బలం లేదు. హీరో ఎందుకు ప్రేమించాడు? అతడు చెప్పిన ఏ మాట విని హీరోయిన్ ప్రేమలో పడింది? వంటివి క్లారిటీగా చూపించలేదు. ఇటువంటి కథల్లో ఆ ఎమోషన్ వర్కవుట్ కావడం కీలకం.

ప్రణవ్ స్వరూప్ కథలో ప్రతి అడుగులో కొత్త బాధ ఎంటరైంది. దానికి తోడు 'కోర్ట్' ఫేమ్ రామ్ జగదీశ్ రాసిన డైలాగుల్లో ఫిలాసఫీ మరింత ఎక్కువైంది. హీరో ఒక్కో డైలాగ్ చెబుతుంటే... 'మాకు ఎందుకీ క్లాస్' అన్నట్టు తయారైంది పరిస్థితి. ఒక్క సీన్ కూడా సర్‌ప్రైజ్ చేయలేదు. స్టార్టింగులో కార్ యాక్సిడెంట్ (హీరోయిన్ పేరెంట్స్) నుంచి చివరి వరకు... ప్రతిదీ ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా జరుగుతుంది.

Also Read: Ravi Mohan Wife Aarti Background Explained - 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

'గీతాంజలి' తరహా సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. సందేశాత్మక కథలు, స్ఫూర్తి నింపే సినిమాలు చూడరని కాదు... కరెక్టుగా తీయాలి. 'రమణీ కళ్యాణం'లో అది మిస్ అయ్యింది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. కానీ తెరపైకి తీసుకు రావడంలో తప్పటడుగులు చాలా వేశారు. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ మీద పెట్టిన శ్రద్ధ ఇతర పాత్రలపై పెట్టలేదు. దాంతో చాలా క్యారెక్టర్లకు సరైన ముగింపు లేకుండా పోయింది. సన్నివేశాలతో ఎంగేజ్ చేసినప్పుడు అటువంటి లోపాలు కనిపించవు. ఆసక్తిగా తీయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా!

దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి రేటింగ్, టేకింగ్‌లో మిస్టేక్స్ కవర్ చేసేలా టిక్నికల్ టీమ్ మంచి అవుట్ పుట్ ఇచ్చింది. మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ ఎస్ కురుప్ బాణీలు బావున్నాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. పిక్చరైజ్ చేసిన తీరు కూడా బావుంది. అరవింద్ తిరుకోవెల కెమెరా వర్క్ ప్లజెంట్ ఫీల్ ఇచ్చింది. నిర్మాతలు కథకు తగ్గట్టు ఖర్చు చేశారు.

Also Read: Ravi Mohan Wife Aarti Background Explained - 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

తెలుగులో దీప్శిఖా చంద్రన్ (ఎవరీ దీప్శిఖా?)కు తొలి చిత్రమిది. కథలో ఆమె పాత్ర కీలకమైనది. కంటి చూపు లేని అమ్మాయిగా చక్కగా నటించింది. దీప్శిఖ నటన, ఆ పాత్రలో చలాకీతనం యువతను ఆకట్టుకోవచ్చు. ఆ అమ్మాయి నటన చాలా సహజంగా ఉంది. సూర్య వశిష్ట హీరో మెటీరియల్. ఆయన లుక్స్ బావున్నాయి. నటన కూడా పర్వాలేదు. శ్రీనివాస రెడ్డి, యాంకర్ శ్యామల, చైతూ జొన్నలగడ్డ తదితరులు కనిపించారు. అందరివీ ఎమోషనల్ రోల్స్ కావడంతో సన్నివేశాలు భారంగా ముందుకు కదులుతాయి.

'ఆనంద్' కథకు అంతులేని బాధలు యాడ్ చేస్తే 'రమణీ కళ్యాణం'. సందేశంతో కూడిన కథను చెప్పాలనుకున్న దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఆలోచన మంచిదే. కానీ, ఆచరణలో మాత్రం తప్పటడుగులు పడ్డాయి. సినిమా ముందుకు వెళ్ళే కొలదీ ఆసక్తి తగ్గుతుంది. బోర్ కొడుతుంది. సంగీతం, ఛాయాగ్రహణం మాత్రం బావున్నాయి. సూరజ్ ఎస్ కురుప్ పాటలు వినే కొలదీ బావుంటాయి. కానీ, థియటర్లలో చివరి వరకూ కూర్చోవడం కష్టమే.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jailer 2: ఫస్ట్ బాలకృష్ణ... ఇప్పుడు షారుఖ్ కూడా? - 'జైలర్ 2' లేటెస్ట్ అప్డేట్
ఫస్ట్ బాలకృష్ణ... ఇప్పుడు షారుఖ్ కూడా? - 'జైలర్ 2' లేటెస్ట్ అప్డేట్
Pandu Master : పండు మాస్టర్‌‌ సర్జరీ - ఏపీ మంత్రి ఆర్థిక సాయం... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
పండు మాస్టర్‌‌ సర్జరీ - ఏపీ మంత్రి ఆర్థిక సాయం... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Dragon: శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
Nag Ashwin : నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్ - సినిమా కంటే తననే ప్రేమిస్తాడన్న సింగీతం... ఎమోషనల్ మూమెంట్స్
నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్ - సినిమా కంటే తననే ప్రేమిస్తాడన్న సింగీతం... ఎమోషనల్ మూమెంట్స్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Embed widget