Allu Arjun: ఐదేళ్ల తర్వాత లుక్ మార్చిన ఐకాన్ స్టార్... గడ్డానికి బై బై, కొత్త సినిమాకు ఏర్పాట్లు?
Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఈ సినిమా లుక్ నుండి విముక్తి కోరుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఐదు సంవత్సరాలుగా ‘పుష్ప’ సిరీస్ సినిమాల కోసం ఎంతగా లీనమయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోకి ఐదు సంవత్సరాలు ఎంతో విలువైన కాలం. ఒక్కో సంవత్సరం రెండేసి సినిమాలను పూర్తి చేయగల సత్తా ఉన్న స్టార్ హీరో.. ఒకే ఒక్క సినిమా కోసం 5 సంవత్సరాలు కేటాయించడం అంటే.. ఆ సినిమాపై ఎంత నమ్మకం ఉంటేనో తప్ప అంత సమయం కేటాయించలేరు. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల కోసం ప్రభాస్, ‘పుష్ప’ సిరీస్ చిత్రాల కోసం అల్లు అర్జున్ ఎంత డెడికేట్ అయ్యారో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ఇద్దరి హీరోల డెడికేషన్‌కి తగ్గ ఫలితం కూడా లభించింది. ఇద్దరూ గ్లోబల్ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకి లేని, రాని నేషనల్ అవార్డును సొంతం చేసుకుని, సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
ఇక ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ కేటాయించిన 5 సంవత్సరాల కాలం ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ‘పుష్ప 2’ సినిమా రూ. 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టే దిశగా వెళుతూ.. విడుదలైన రోజు నుండి ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే వస్తుంది. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమా ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాలీవుడ్‌కి చెందిన పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఆశ్చర్యపోతూ.. ‘పుష్పరాజ్’కు సలాం కొట్టేస్తున్నాయి. మరోవైపు ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయడానికి లేకుండా సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్‌ని హౌస్ అరెస్ట్ చేసేసింది. ఈ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని విడుదలకు ముందే యూనిట్ ప్లాన్ చేసుకున్నా.. వారి ప్లాన్ అంతా తారుమారైంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే.. దాదాపు 5 సంవత్సరాలు ‘పుష్ప’కే అంకితమైన అల్లు అర్జున్.. ఆ పాత్ర కోసం గడ్డాన్ని, జుత్తును పొడవుగా పెంచి.. అదే లుక్‌లో కనిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడా బీయర్డ్ లుక్‌కి బై బై చెప్పే సమయం వచ్చేసింది.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
ఆల్రెడీ బీయర్డ్‌ని ట్రిమ్ చేసిన అల్లు అర్జున్.. అతి త్వరలోనే క్లీన్ షేవ్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ గడ్డం కారణంగా తను ఎటువంటి ఇబ్బందులను.. ఈ 5 ఇయర్స్‌లో ఫేస్ చేశాడో.. ఇటీవల ‘పుష్ప 2’ ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన గారాలపట్టి అర్హ.. ఈ లుక్‌లో తనని దూరం పెట్టేసిందని, తన దగ్గరకి రావడమే మానేసిందని చెప్పుకొచ్చాడు. ఎప్పుడెప్పుడు ఈ లుక్ నుండి బయటపడతానా.. తన బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుందామా? అని ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా బన్నీ మీడియాకు తెలిపాడు. అంటే, ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ అంత అంకితమయ్యాడన్నమాట. ఇక, ఇప్పుడు సినిమా విడుదలై, సంచలన రికార్డులను నమోదు చేసింది. ‘పుష్ప 3’ ఎప్పుడనేది ఇంకా క్లారీటీ లేదు. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం, అల్లు అర్జున్ మేకోవర్ అయ్యే సమయం వచ్చేసింది.
అంటే, ‘పుష్ప’ లుక్‌కి వీడ్కోలు ఇచ్చేసి. తన తదుపరి సినిమా కోసం అల్లు అర్జున్ ఓ స్పెషల్ ఫొటో షూట్‌ని చేయబోతున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమా పాన్ వరల్డ్‌గా ఉండనుందని తెలుస్తుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న నాల్గవ సినిమా ఇది. ‘పుష్ప’ సక్సెస్ నిమిత్తం ఇంక ఎటువంటి భారీ ఫంక్షన్స్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను జరిపి, ఆ వెంటనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారనేలా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Read Also : SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!